మోహన్‌లాల్
మలయాళ సూపర్ స్టార్, ఫ్యాన్స్ అభిమానంగా పిలుచుకునే ‘కంప్లీట్ యాక్టర్’ మోహన్‌లాల్‌కు శుక్రవారం కేంద్రప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ గౌరవాన్ని తనతో ప్రయాణం చేసినవాళ్లందరకు పంచారాయన. ‘‘నాది 40 ఏళ్ళ సుదీర్ఘ సినిమా ప్రయాణం. ఈ ప్రయాణంలో కొన్నివేల మంది శ్రేయోభిలాషులను నా దారిలో కలిశాను. సెట్‌లో లైట్‌బాయ్ కావచ్చు, మా పక్కనే యాక్ట్ చేసిన ధృవతారలు కావచ్చు.
మమ్మల్ని తెర మీద చూసి అభిమానించిన ప్రేక్షకులు కావచ్చు. ప్రేక్షకుల అంచనాలను అందుకోవడానికి కృషి చేసే ప్రయత్నంలో వాళ్ల ప్రేమాభిమానాలే మాకు ఉత్సాహాన్నిచ్చే మంత్రాలయ్యాయి. ఈ పురస్కారాన్ని నాకు ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఇదో ఆశీర్వాదంలా భావిస్తున్నా. నాతో ప్రయాణం చేసిన వాళ్లందరికీ ప్రేమతో ఈ అభినందనను అంకితమిస్తున్నాను. ఈ గౌరవం, గుర్తింపునకు చాలా సంతోషిస్తున్నాను. ఈ ప్రయాణంలో నాతో భాగమైన వారందరికీ కృతజ్ఞుడిని’’ అని పేర్కొన్నారు మోహన్‌లాల్.
Comments
Please login to add a commentAdd a comment