భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన సింధు ఎంతో సంతోషంగా పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఉత్సాహంగా డ్యాన్స్ కూడా చేశారు. నిత్యం ఆటలతో బిజీగా ఉండే సింధు ఇలా డ్యాన్స్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘లవ్ న్వాంటిటి’ పాటకు నృత్యం చేసిన హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్.. గ్రీన్ లెహంగాలో తనదైన స్టెప్పులతో అదరగొట్టారు. ఈ వీడియోను సింధు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు ఒకే రోజులో మిలియన్‌కు పైగా వ్యూస్ వచ్చాయి.
చదవండి: పద్మభూషణ్ అవార్డు అందుకున్న పీవి సింధు..
కాగా సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పీవీ సింధు 2020 సంవత్సరానికి గాను పద్మభూషణ్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన సింధు.. అంతకు ముందు 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో సిల్వర్ పతకం గెలుచుకుంది. ఇక 2019లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఈ స్టార్ అంతకుముందు వరల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీల్లో రెండు కాంస్యాలు, రెండు రజతాలు సాధించింది. ఈ క్రమంలో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఎక్కువ పతకాలు సాధించిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. 2015లో సింధుకు పద్మశ్రీ అవార్డు దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment