‘నవోదయ’ విద్యార్థులు దేశానికే ఆదర్శం కావాలి
లేపాక్షి : లేపాక్షి జవహర్ నవోదయ పాఠశాల విద్యార్థులు దేశానికే ఆదర్శం కావాలని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆకాంక్షించారు. ఆ పాఠశాల ఆవరణలో నూతనంగా నిర్మించిన డార్మెటరీని బుధవారం రాత్రి ఆయన ప్రారంభించారు. నవోదయ పాఠశాల కీర్తిని చాటేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాల్సిన ఈ పాఠశాలను తమ తండ్రి ఎన్టీఆర్ తన హయాంలో లేపాక్షిలో సుమారు 20 ఎకరాల్లో ఏర్పాటు చేయించారని తెలిపారు.
దక్షిణాది రాష్ట్రాల్లో లేపాక్షి విద్యాలయం అన్ని రంగాల్లో జాతీయ అవార్డులు సాధించడంపై ప్రిన్సిపల్, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రిన్సిపల్ భాస్కర్‌కుమార్, వైస్ ప్రిన్సిపఽల్ మల్లికార్జున, బీసీ కార్పొరేషన్ చైర్మన్ రంగనాయకులు, మార్కెట్‌యార్డు చైర్మన్ కిష్టప్ప, ఎంపీపీ హనోక్, జెడ్పీటీసీ సభ్యుడు ఆదినారాయణరెడ్డి, ఎంపీడీఓ వెంకటలక్ష్మమ్మ, తహశీల్దార్ ఆనందకుమార్, ఎంఈఓ నాగరాజు, సర్పంచ్ జయప్ప, ఎంపీటీసీ సభ్యుడు చిన్నఓబన్న పాల్గొన్నారు.