‘సాయిచరణ్‌ మృతికి యాజమాన్యమే కారణం’ | students protest over tdp-mla-balakrishna-gunman-son-suicide-in-tirupati | Sakshi
Sakshi News home page

‘సాయిచరణ్‌ మృతికి యాజమాన్యమే కారణం’

Published Tue, Mar 14 2017 11:25 AM | Last Updated on Fri, Nov 9 2018 4:46 PM

కాలూరు నారాయణ మెడికల్‌ అకాడమి స్కూల్‌లో చదువుతున్న సాయిచరణ్‌ నాయక్‌ మృతి ఘటనతో తోటి విద్యార్థుల్లో ఆగ్రహం పెల్లుబికింది.

చిత్తూరు: కాలూరు నారాయణ మెడికల్‌ అకాడమి స్కూల్‌లో చదువుతున్న సాయిచరణ్‌ నాయక్‌ మృతి ఘటనతో తోటి విద్యార్థుల్లో ఆగ్రహం పెల్లుబికింది. సాయిచరణ్‌ను విద్యా సంస్థే పొట్టనపెట్టుకుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అంజిరెడ్డి అనే టీచర్‌ బూటు కాలుతో తన్నడం వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. ఇందుకు నిరసనగా  విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. హాస్టల్‌ గదుల అద్దాలు ధ్వంసం చేసి రోడ్డుపై బైఠాయించారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విద్యా సంస్థ సిబ్బందిపై వెంటనే కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే మంత్రి నారాయణను బర్త్‌రఫ్‌ చేయాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement