ప్రముఖ సినీ హీరో బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీలో అసమ్మతి పోరు తీవ్రమైంది. బాలకృష్ణ పీఏ శేఖర్ ఆగడాలు మితిమీరిపోతున్నాయని ఆరోపిస్తూ నియోజకవర్గ పరిధిలోని చిలమత్తూరు, లేపాక్షి జెడ్పీటీసీలు రాజీనామా చేశారు. అలాగే ఆదివారం హిందూపురంలో టీడీపీ అసంతృప్త నేతలు సమావేశం కావాలని నిర్ణయించారు. కాగా ఈ సమావేశానికి పోలీసులు అనుమతి నిరాకరించారు.