బాలకృష్ణ
సాక్షి, అనంతపురం : రాష్ట్రంలో టీడీపీ నేతల అగడాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. అధికారంలో ఉన్నామని ఇష్టా రీతిగా ప్రవర్తిస్తున్నారు. జిల్లాలోని చిలమత్తూరు మండలం టేకులోడు ఐటీ సెజ్‌లో టీడీపీ నేతలు చేతివాటం ప్రదర్శించారు. తమ ఎమ్మెల్యేకు చెప్పుకుంటే న్యాయం జరుగుతుందని బాధితులు అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే బాలకృష్ణను కలిసి తమకు జరిగిన అన్యాయం చెప్పుకున్నారు. ఐనా లాభం లేకుండా పోయింది. ఆ విషయాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ పట్టించుకోలేదని తెలుస్తోంది.
వివరాలివి.. రైతు వెంకటప్ప దంపతులు మరణించటంతో పరిహారం సొమ్మును టీడీపీ నేతలు డ్రా చేసుకున్నారు. ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి రూ. 30 లక్షల పరిహారాన్ని టీడీపీ నేత రంగారెడ్డి స్వాహా చేశాడు. టీడీపీ నేతలతో రెవెన్యూ, పోలీసు అధికారులు కుమ్మక్కయ్యారు. ఈ విషయంపై మృతుల కుటుంబ సభ‍్యులు ఎమ్మెల్యే బాలకృష్ణకు చెప్పి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. కానీ, బాలకృష్ణ దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment