బాలయ్యపై జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు | complaint on mla balakrishna to National Commission for Women over comments on women | Sakshi
Sakshi News home page

బాలయ్యపై జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు

Published Wed, Mar 9 2016 8:22 PM | Last Updated on Fri, Aug 17 2018 2:27 PM

బాలయ్యపై జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు - Sakshi

బాలయ్యపై జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు

హైదరాబాద్: మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై  క్రిమినల్ కేసు నమోదు చేసేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టు న్యాయవాది సాయికృష్ణ ఆజాద్ జాతీయ మహిళా కమిషన్‌ను కోరారు.

హిందూపురం ఎమ్మెల్యే హోదాలో ఉండటమే కాకుండా సినీ నటుడిగా ఉండి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేయడానికి ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కమిషన్ను కోరారు. సావిత్రి మూవీ ఆడియో ఫంక్షన్‌లో మహిళలపై బాలకృష్ణ అసభ్యకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో ఆయనపై కేసులు నమోదైయ్యాయి. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో బాలకృష్ణ క్షమాపణ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement