రాహుల్‌కు మహిళా కమిషన్‌ నోటీసులు | National Commission for Women issues notice to Rahul Gandhi | Sakshi
Sakshi News home page

రాహుల్‌కు మహిళా కమిషన్‌ నోటీసులు

Published Fri, Jan 11 2019 5:24 AM | Last Updated on Fri, Jan 11 2019 5:24 AM

National Commission for Women issues notice to Rahul Gandhi - Sakshi

న్యూఢిల్లీ: రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌పై అనైతిక వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) గురువారం నోటీసులు జారీ చేసింది. జైపూర్‌లో ఈ నెల 9న నిర్వహించిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించే క్రమంలో రాహుల్‌ నిర్మలా సీతారామన్‌పై వ్యాఖ్యలు చేశారు. ‘పార్లమెంట్‌లో రఫేల్‌ ఒప్పందం గురించి చర్చ జరిగే సమయంలో ప్రధాని మోదీ పారిపోయి తనను కాపాడమని ఓ మహిళ (నిర్మలా సీతారామన్‌)ను కోరారు. ఆయన తనను తాను కాపాడుకోలేకపోయారు’అని రాహుల్‌ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి వార్తాపత్రికలలో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్‌ రాహుల్‌కు నోటీసులు ఇచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement