ఎమ్మెల్యే పీఏ శేఖర్ వర్గీయులైన ఎంపీపీ మార్పుపై ఎమ్మెల్యే బాలకృష్ణతో త్వరలో చర్చిస్తామని జెడ్పీటీసీ సభ్యుడు లక్ష్మీనారాయణరెడ్డి, వైస్ ఎంపీపీ వెంకటరెడ్డి తెలిపారు.
చిలమత్తూరు : ఎమ్మెల్యే పీఏ శేఖర్ వర్గీయులైన ఎంపీపీ మార్పుపై ఎమ్మెల్యే బాలకృష్ణతో త్వరలో చర్చిస్తామని జెడ్పీటీసీ సభ్యుడు లక్ష్మీనారాయణరెడ్డి, వైస్ ఎంపీపీ వెంకటరెడ్డి తెలిపారు. బుధవారం మరకొత్తపల్లి కాలనీ సమీపంలోని ఓ తోటలో వారు సమావేశమయ్యారు. ముందుగా అనుకున్న ప్రకారం రెండున్నరేళ్లకు ఎంపీపీ మార్పు చేయాలన్నారు. దీనిపై బాలకృష్ణతో చర్చిస్తామన్నారు.
అవినీతి, అక్రమాలకు పాల్పడిన పీఏ శేఖర్‌ను తొలగించడం బాలకృష్ణ నిజాయితీకి నిదర్శనమన్నారు. సర్పంచ్ లక్ష్మీనరసింహప్ప, మాజీ ఎంపీపీ శివప్ప, మాజీ కన్వీనర్ రంగారెడ్డి, డైరెక్టర్ రజనీకాంత్, నాయకులు లక్ష్మీనారాయణ యాదవ్, సోమశేఖర్, శివ, అశ్వర్థప్ప, టి.నాగభూషణం, ఆదిమూర్తి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.