
పీఏ కావాలో.. పార్టీ నేతలు కావాలో తేల్చుకో!
► వారం రోజులే డెడ్‌లైన్
► బాలకృష్ణకు తేల్చిచెప్పిన హిందూపురం టీడీపీ నేతలు
చిలమత్తూరు: ‘‘వారం రోజులే డెడ్‌లైన్.. ఆలో పు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తన వ్యక్తి గత కార్యదర్శి చంద్రశేఖర్‌ను ఇక్కడి నుంచి పంపకపోతే పార్టీ పదవులకు రాజీనామా చేయ డంతో పాటు హిందూపురంలోని ఎన్టీఆర్ విగ్ర హం ఎదుటే నిరాహార దీక్ష చేస్తాం.. పీఏ కావాలో పార్టీ నేతలు కావాలో బాలకృష్ణనే నిర్ణయించుకోవాలి’’ అని అనంతపురం జిల్లాల హిందూపురం టీడీపీ అసమ్మతి నేతలు తేల్చి చెప్పారు. కొన్ని రోజులుగా నియోజకవర్గంలో ఎమ్మె ల్యే పీఏ, ఆయన వర్గీయులకు వ్యతిరేకంగా అసమ్మతి నాయకులు సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఆదివారం మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, నాయకులు అంబికా లక్ష్మీ నారా యణ తదితర నేతలు చిలమత్తూరులో భారీ సమావేశం, ర్యాలీ నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అయితే బాలకృష్ణ పీఏ శేఖర్ తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి పోలీసులతో 144 సెక్షన్, 30 యాక్టు అమలు చేయించారు. దీంతో మండలంలోని 11 పంచాయతీల వారీగా 40 మంది పోలీసు అధికారుల పర్యవేక్షణలో సుమారు 450 పోలీసులు మోహరించారు.
వెనక్కు తగ్గని అసమ్మతి నాయకులు
చిలమత్తూరులో పోలీసులు మోహరింపు నేపథ్యంలో అసమ్మతి నాయకులు మండలానికి సరిహద్దు ప్రాంతమైన బాగేపల్లి షాదీమహల్ వద్ద సమావేశం నిర్వహించా లనుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో అక్కడి పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వారంతా సమీపంలోని సుంకులమ్మ ఆలయం వద్ద సమావేశమయ్యారు. అయినప్పటికీ బాగేపల్లి ఎస్‌ఐ వెంకటేశులు, సిబ్బంది అడ్డు చెప్పడంలో ఆలయ సమీపం లోని బాబురెడ్డి తోటలో సమావేశం నిర్వహించారు.
అవినీతి శేఖర్‌ను తరుముదాం..
నియంత పాలన చేస్తున్న ఎమ్మెల్యే పీఏ శేఖర్, ఆయన వర్గీయులను పంపేవరకు పోరాటం ఆగదని మాజీ ఎమ్మె ల్యే వెంకటరాముడు, అంబికా లక్ష్మీనారాయణ తేల్చిచె ప్పారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించే సమావేశాలకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. శేఖర్‌ను ఇక్కడి నుంచి పంపిస్తేనే టీడీపీ బతుకు తుందని స్పష్టం చేశారు. అవినీతి శేఖర్‌ను తరుముదాం.. పార్టీని బలోపేతం చేద్దామని నినదించారు. కార్యక్రమంలో మాజీ సర్పం చ్‌లు, మాజీ ఎంపీపీలు, కన్వీనర్లు, సుమారు 1,500 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.