గడిచిన 120 ఏళ్ల చరిత్రలో అమరావతి ప్రాంతం కృష్ణా జలాలతో ముంపునకు గురైన దాఖలా లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎన్జీటీలో రాష్ట్ర ప్రభుత్వ వాదన
సాక్షి, న్యూఢిల్లీ: గడిచిన 120 ఏళ్ల చరిత్రలో అమరావతి ప్రాంతం కృష్ణా జలాలతో ముంపునకు గురైన దాఖలా లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ హరిత ట్రిబ్యునల్ దృష్టికి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి వరద ముప్పు ఉందని దాఖలైన పిటిషన్లపై విచారణను జాతీయ హరిత ట్రిబ్యునల్ సోమవారం చేపట్టింది.
ప్రతివాది అయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ఎ.కె.గంగూలీ తన వాదనలు వినిపిస్తూ... .కృష్ణా నదీ జలాలతో అమరావతికి వరద ముప్పు ఉండదని పేర్కొన్నారు. తదుపరి వాదనలను మంగళవారం వింటామని చెబుతూ ధర్మాసనం విచారణను వాయిదావేసింది.