సాక్షి, నల్లగొండ రూరల్: తెలంగాణ రాష్ట్రాన్ని ఎడారిగా మార్చేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి తకెళ్లపల్లి రవీందర్‌రావు ఆరోపించారు. అందులో భాగంగానే నదీ జలాలపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు.శనివారం నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి , మిర్యాలగూడ ఎమ్మెల్యే బాస్కర్‌రావు, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి , వైస్ చైర్మన్ అబ్బగోనిరమేష్‌గౌడ్‌లతో కలిసి ఎమ్మెల్యే నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య ఉందని, వ్యవసాయ ఆధారంగా జీవనం సాగుతున్న నల్లగొండకు కేంద్రం జారీ చేసిన కృష్ణా నీటి గెజిట్‌తో తీరని నష్టం జరుగుతుందన్నారు. వృథాగా పోయే గోదావరి నీటిలో కాళేశ్వరం ప్రాజెక్టు , లిప్టులు , బ్యారేజిలను నిర్మించారన్నారు. ఆంధ్రాపాలకులు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేక పోతున్నాయని ఆరోపించారు. అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు పంకజ్ యాదవ్, పిల్లి రామరాజు యాదవ్, బోనగిరి దేవేందర్, అభిమన్యు శ్రీనివాస్, సహదేవ్‌రెడ్డి, దొటి శ్రీనివాస్, ఖరీంపాష, దేప వెంకట్‌రెడ్డి, నాగార్జున, మధుసూదన్‌రెడ్డి, రావుల శ్రీనివాస్‌రెడ్డి, పబ్బు సందీప్‌గౌడ్, సత్తయ్య గౌడ్, మల్లేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment