పూర్తి స్థాయి నీటి విడుదల సామర్థ్యాన్ని గుర్తించలేని వ్యవస్థ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వినియోగ, విడుదల లెక్కలు పక్కాగా ఉండేలా ప్రధాన ప్రాజెక్టుల వద్ద ఏర్పాటు చేస్తున్న టెలీమెట్రీ పరికరాల పనితీరుపై సందేహాలు రేకెత్తుతున్నాయి. ప్రాజెక్టు నుంచి కాల్వలకు నీటి తరలించే సమయంలో సరైన విడుదల (డిశ్చార్జి) లెక్కలను అవి నమోదు చేయడం లేదని వాదనలు వినవస్తున్నా యి. ఇందుకు బలం చేకూరుస్తూ పోతిరెడ్డిపాడు వద్ద ఏర్పాటు చేసిన టెలీమెట్రీ పరికరాలు పూర్తి స్థాయి డిశ్చార్జిలను చూపడం లేదంటూ లేఖ రాయడం చర్చనీయాం శంగా మారింది.
కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల పరిధిలో మొత్తంగా 47 చోట్ల టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించగా, అందులో తొలి విడతగా రూ.4 కోట్ల వ్యయంతో జూరాల, శ్రీశైలం, సాగర్‌లలో 18 చోట్ల ఏర్పాటు చేశారు. అయితే ఇందులో పోతిరెడ్డిపాడు వద్ద ఏర్పాటు చేసిన టెలీమెట్రీ వ్యవస్థ ప్రవాహాలను సరిగా నమోదు చేయడం లేదని కృష్ణాబోర్డు గుర్తించింది. దాంతో అక్కడ ప్రవాహాలను లెక్కించాలంటే ఆటోమెటిక్ సెన్సర్లను ఏర్పాటు చేయాలని తెలంగాణ, ఏపీలకు రాష్ట్రాలకు సూచించింది. అప్పుడే సరైన నీటి విడుదల లెక్కలు వస్తాయని పేర్కొంది.
టెలీమెట్రీపై కొత్త సందేహాలు!
Published Wed, Mar 8 2017 3:03 AM | Last Updated on Wed, Aug 29 2018 9:29 PM
Advertisement
Advertisement