► ధర్మాసనంలోని ఇద్దరు సభ్యులు మహారాష్ట్ర, కర్ణాటకలకు చెందినవారన్న రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది
► వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించిన జస్టిస్ దీపక్ మిశ్రా
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీ జలాలను మళ్లీ నాలుగు రాష్ట్రాల మధ్య కేటాయించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను మరో బెంచ్‌కు బదిలీ చేయాలని జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం రిజిస్ట్రీని ఆదేశించింది. బుధవారం ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్.. త్రిసభ్య ధర్మాసనంలో జస్టిస్ ఎ.ఎం.ఖన్విల్కర్, జస్టిస్ మోహన్ ఎం.శంతనగౌడర్ కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలకు చెందిన వారన్న అంశాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు.
ఇలాంటి ప్రస్తావన తేవడాన్ని జస్టిస్ దీపక్ మిశ్రా ఆక్షేపిస్తూ.. మిగిలిన కేసుల విచారణ అనంతరం ఈ కేసును విచారిస్తామని, విచారణ నుంచి తప్పుకోబోమని స్పష్టంచేశారు. అయితే మిగిలిన కేసుల విచారణ అనంతరం ఈ పిటిషన్ విచారణకు రాగా.. పిటిషనర్ ప్రస్తావనను మన్నించారు. ఆ ఇద్దరు సభ్యులు లేని మరో ధర్మాసనానికి పిటిషన్‌ను బదిలీ చేయాలని జస్టిస్ దీపక్ మిశ్రా సుప్రీంకోర్టు రిజిస్ట్రీ కార్యాలయాన్ని ఆదేశించారు.
మరో బెంచ్‌కు కృష్ణా జలాల కేసు
Published Thu, Apr 20 2017 3:31 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement
Advertisement