
నెల్లూరు: ఏపీలోని నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించినట్లు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ‘‘పేదలందరికీ ఇళ్లు’’ పథకం అమలుపై చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. ఉప ఎన్నికల ఫలితాలపై బేరీజు వేసుకున్నామని సజ్జల అన్నారు.
అంతే కాకుండా ‘‘కృష్ణా జలాల వివాదం ఎవరు సృష్టించారో అందరికీ తెలుసు. దాదాగిరీ ఎవరు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలను కూడా పొరుగు రాష్ట్రం పెడచెవిన పెట్టింది. జలవిద్యుత్ పేరుతో 30 టీఎంసీల నీటిని సముద్రం పాలు చేశారు. ఎగువ ప్రాంతంలో ఉన్నామన్న భావనతో జల వివాదానికి దిగారు. ఆంధ్రా వాటా నీటిని కాపాడుకునేందుకు సీఎం జగన్ ప్రయత్నించారు.’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment