- కృష్ణాకు ఎస్‌కే శ్రీవాత్సవ, గోదావరికి హెచ్‌కే సాహు
- పూర్తి స్థాయి చైర్మన్లను నియమించిన కేంద్ర జల సంఘం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి జలాల పంపకాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య వివాదాలు తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో కేంద్ర జలసంఘం ఆ రెండు నదీ బోర్డులకు కొత్తగా పూర్తి స్థాయి చైర్మన్లను నియమించింది. కృష్ణాబోర్డుకు ఎస్‌కే శ్రీవాత్సవను, గోదావరి బోర్డుకు హెచ్‌కే సాహును చైర్మన్లుగా నియమించింది.
ఈ మేరకు గురువారం కేంద్ర జల సంఘం చైర్మన్ నరేంద్ర కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్‌కే శ్రీవాత్సవ ప్రస్తుతం పుణేలో నేషనల్ వాటర్ అకాడమీ చీఫ్ ఇంజనీర్ స్థాయిలో ఉండగా.. తీస్తా బేసిన్ ఆర్గనైజేషన్(టీబీఓ) పశ్చిమబెంగాల్ శాఖలో హెచ్‌కే సాహు చీఫ్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. వీరిద్దరు వచ్చే సోమవారం బాధ్యతలు స్వీకరిస్తారని బోర్డు వర్గాలు తెలిపాయి.
కృష్ణా, గోదావరి బోర్డులకు కొత్త చైర్మన్లు
Published Fri, Apr 28 2017 12:38 AM | Last Updated on Wed, Aug 29 2018 9:29 PM
Advertisement