కృష్ణానదీ జలాల్లో వాటాల కేటాయింపులు, వాటి ఆధారంగా నిర్మిస్తోన్న ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు కేంద్రానికి పరస్పర ఫిర్యాదులు చేశాయి. ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లోని కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన అపెక్స్ సమావేశంలో.. తెలంగాణ నిర్మిస్తోన్న పాలమూరు, డిండి ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలు వ్యక్యం చేయగా, అవి రెండూ పాత ప్రాజెక్టులేనని, తమకు దక్కాల్సిన నీటివాటాను పెంచాలని తెలంగాణ వాదించింది. మొత్తంగా ఎజెండాలోని ఐదు అంశాల్లో మూడింటికి ఏకాభిప్రాయం లభించగా, కీలకమైన ప్రాజెక్టులపై మాత్రం స్పష్టత రాలేదు.