సంగెం(పరకాల) : కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. ఆదివారం మండలంలోని కృష్ణానగర్‌లో నూతనంగా రూ.16 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనం, రూ.30 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే ధర్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పారదర్శకంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందిస్తోందని చెప్పారు. ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడుతూ గ్రామాలకు గతంలో ఎన్నడూ రాని విధంగా ఈ నాలుగేళ్లలో నిధులు మంజూరయ్యాయని, వాటితో చేపట్టే అభివృద్ధి ప్రతిపక్షాలకు కన్పించడం లేదా అని ప్రశ్నించారు.
నాలుగైదు రోజుల్లో ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తామని, వచ్చే ఏడాది కాలేశ్వరం నీళ్లు చెరువుల్లో నింపి రెండు పంటలకు అందిస్తామని చెప్పారు. గ్రామస్తుల కోరిక మేరకు అంగన్‌వాడీ, యాదవ కమ్యూనిటీ భవనాలు, వాటర్ ట్యాంకు, విద్యుత్ స్తంభాలు, రేషన్‌షాపు మంజూరుకు హామీ ఇచ్చారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఎంపీపీ కట్టయ్య, సర్పంచ్ కోడారి రాజమ్మ, ఎంపీటీసీ సభ్యుడు బానోత్ బాలు, ఉపసర్పంచ్ సుబ్బారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సుదర్శన్‌రెడ్డి, మండల కన్వీనర్ నరహరి, నాయకులు వెంకటేశ్వర్‌రావు, మోహన్ ఎంపీడీఓ భద్రునాయక్, డీఈ మంగ్యానాయక్, ఏఈలు కిష్టయ్య, రాజునాయకులు తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ సంక్షేమ పథకాలు: ఎంపీ
Published Mon, Mar 26 2018 11:12 AM | Last Updated on Wed, Aug 15 2018 9:04 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment