scehems
-
నేటి నుంచి విద్యార్థులకు అల్పాహారం పథకం
మంచిర్యాల: సర్కారు బడిలో విద్యార్థులకు అల్పాహారం పథకం శుక్రవారం లాంఛనంగా ప్రారంభం కానుంది. జిల్లాలో నియోజకవర్గానికో పాఠశాలలో పథకం అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. మంచిర్యాల నియోజకవర్గంలో న్యూగర్మిళ్ల పాఠశాల, చెన్నూర్ నియోజకవర్గంలో మందమర్రి ఫిల్డర్బెడ్ ఎంపీపీఎస్, బెల్లంపల్లి నియోజకవర్గంలో బెల్లంపల్లి 2ఇంక్లైన్ ఎంపీపీఎస్‌ల్లో పథకాన్ని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, ప్రభుత్వ విప్ సుమన్, దుర్గం చిన్నయ్య ప్రారంభిస్తారు. పాఠశాల సమయానికి కంటే 45 నిమిషాల ముందు అల్పాహారం అందిస్తారు. పిల్లలో పోషకాహార లోపం నివారించడం, తరగతి గదిలో హాజరు నమోదు పెంచడానికి ప్రభుత్వం అల్పాహార పథకాన్ని అమలు చేస్తోంది. కళాశాలల్లో మధ్యాహ్న భోజనం ఎప్పుడో..? డ్రాపౌట్స్ నివారణతోపాటు విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలుకు నిర్ణయించనట్లు 2020 జూలై 18న కేసీఆర్ ప్రకటించారు. మూడేళ్లయినా పథకం అమలుకు నోచుకోక విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 10 ప్రభుత్వ కళాశాలల్లో 3,600 మంది విద్యార్థులు ఉన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు కళాశాలకు ఉదయం 8గంటలకు బయలుదేరితే ఇంటికి వెళ్లేసరికి రాత్రి 8గంటలు దాటుతుందని తెలుస్తోంది. కళాశాలలో చదివే విద్యార్థులందరూ పేదలు కావడంతో ఉదయం పూట అల్పాహారం తీసుకోకుండానే కళాశాలలకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో అర్ధాకలితో పాఠాలు అర్థంకాక అనేక ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్న ప్రభుత్వం కనీసం కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని పలువురు విద్యార్థులు కోరుతున్నారు. మెనూ ఇలా.. సోమవారం : ఇడ్లీ, సాంబారు లేదా గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ మంగళవారం : పూరి, ఆలుకూర్మా లేదా టోమాటో బాత్, సాంబార్ బుధవారం : ఉప్మా, సాంబారు లేదా బియ్యం రవ్వ కిచిడీ, చట్నీ గురువారం : చిరుధాన్యాల ఇడ్లీ, సాంబారు లేదా పొంగల్, సాంబారు శుక్రవారం : ఉగ్గని, అటుకలు, చిరుధాన్యాల ఇడ్లి, చట్నీ, లేదా బియ్యం రవ్వ కిచిడీ, చట్నీ శనివారం : పొంగల్, సాంబారు లేదా కూరగాయల పులావ్, పెరుగు చట్నీ, ఆలుకుర్మా -
ఆరోగ్యశ్రీ పరిధిలోకి మరిన్ని చికిత్సలు..!
-
కేంద్ర రైతు పథకాలపై బీజేపీ వాల్‌పోస్టర్
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ ఈ నాలుగేళ్లలో రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ బీజేపీ రాష్ట్ర శాఖ వాల్ పోస్టర్‌ను రూపొందించింది. మంగళవారం బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ నాలుగేళ్లలో ప్రధాని మోదీ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, భూసార పరీక్షలు వంటి వినూత్న పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ఈ ఏడాది పెంచిన మద్దతు ధరల వల్ల రైతులకు ఎకరానికి రూ. 4 వేల నుంచి రూ.12 వేల వరకు లబ్ధి చేకూరుతోందని చెప్పారు. ఈ నెల 17 నుంచి 26 వరకు చేపట్టనున్న ‘మాట తప్పిన రాష్ట్ర ప్రభుత్వం– మార్పు కోసం బీజేపీ’నినాదంతో గ్రామాల్లో బైక్ ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎన్నికల హామీలు, ప్రధాని మోదీ చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామన్నారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నర్సింహారెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యుడు జైపాల్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ కుమార్ పాల్గొన్నారు. -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు: ఎంపీ
సంగెం(పరకాల) : కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. ఆదివారం మండలంలోని కృష్ణానగర్‌లో నూతనంగా రూ.16 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనం, రూ.30 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే ధర్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పారదర్శకంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందిస్తోందని చెప్పారు. ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడుతూ గ్రామాలకు గతంలో ఎన్నడూ రాని విధంగా ఈ నాలుగేళ్లలో నిధులు మంజూరయ్యాయని, వాటితో చేపట్టే అభివృద్ధి ప్రతిపక్షాలకు కన్పించడం లేదా అని ప్రశ్నించారు. నాలుగైదు రోజుల్లో ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తామని, వచ్చే ఏడాది కాలేశ్వరం నీళ్లు చెరువుల్లో నింపి రెండు పంటలకు అందిస్తామని చెప్పారు. గ్రామస్తుల కోరిక మేరకు అంగన్వాడీ, యాదవ కమ్యూనిటీ భవనాలు, వాటర్ ట్యాంకు, విద్యుత్ స్తంభాలు, రేషన్‌షాపు మంజూరుకు హామీ ఇచ్చారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఎంపీపీ కట్టయ్య, సర్పంచ్ కోడారి రాజమ్మ, ఎంపీటీసీ సభ్యుడు బానోత్ బాలు, ఉపసర్పంచ్ సుబ్బారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సుదర్శన్‌రెడ్డి, మండల కన్వీనర్ నరహరి, నాయకులు వెంకటేశ్వర్రావు, మోహన్ ఎంపీడీఓ భద్రునాయక్, డీఈ మంగ్యానాయక్, ఏఈలు కిష్టయ్య, రాజునాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఈ పథకాల్లో పెట్టుబడి సురక్షితం
చింతలపూడి : ప్రస్తుతం బ్యాంక్ వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయి. చిన్నమొత్తాల్లో పెట్టుబడి పెట్టాలనుకునే చిరుజీవులకు కంపెనీ ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా చిన్న మొత్తాల సంస్థ పథకాలు ఉపయుక్తంగా ఉంటాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కంపెనీ ఫిక్స్డ్ డిపాజిట్లకు భద్రత తక్కువ. చిన్నమొత్తాల పొదుపు ప«థకాల్లో పెట్టుబడులు సురక్షితంగా ఉంటాయి. పైగా ప్రభుత్వ హామీని కలిగి ఉంటాయి. దీంతో అవే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ఆ పథకాల గురించి ఓ సారి స్థూలంగా.. పీపీఎఫ్ పథకం వడ్డీ రేట్ల విషయంలో బ్యాంక్ డిపాజిట్లతో పోలిస్తే పీపీఎఫ్ ఉత్తమమైన పథకం. బ్యాంక్ డిపాజిట్లపై వచ్చే వడ్డీకి పరిమితి దాటితే పన్ను కట్టాల్సి వస్తుంది. పీపీఎఫ్కైతే పన్ను మినహాయింపు ఉంటుంది. బ్యాంకులు కేవలం 7.5 శాతం వడ్డీ ఇస్తుండగా, పీపీఎఫ్‌లో మాత్రం 8.1 శాతం వడ్డీ వస్తోంది. ఆదాయపు పన్నుచట్టం 80సీ పన్ను మినహాయింపు ఉంది. పీపీఎఫ్ మెచ్యూరిటీ 15 ఏళ్లు. సుకన్య సమృద్ధి కంపెనీ ఫిక్స్డ్ డిపాజిట్ల పథకాలను పక్కన పెడితే ఏ ఇతర పెట్టుబడి పథకంలో కూడ 8.6 శాతం వడ్డీ రావడం లేదు. కాబట్టి మీకు అమ్మాయి ఉంటే ఈ పథకం గురించి ఆలోచించడం మంచిది. వచ్చే రాబడికి పన్ను ఉండదు. సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంది. మీకు అమ్మాయి ఉంటే వెంటనే ఈ పథకంలో పెట్టుబడి పెట్టొచ్చు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు ఇతర పోస్టాఫీసు పథకాల్లాగే జాతీయ పొదుపు పత్రాలు బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీని అందిస్తున్నాయి. ప్రస్తుతం 8.1 శాతం వడ్డీ రేటు అంటే బ్యాంకుల కంటే 0.5 శాతం అదనంగా వడ్డీ లభిస్తోంది. సెక్షన్ 80సీ కింద ఆదాయపు పన్ను మినహాయింపు ఉంది. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్స్ సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌లో భాగంగా 8.6 శాతం వడ్డీ వస్తోంది. ఇది మారుతూ ఉంటుంది. ఈ పథకంలోనూ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంది. ఇందులో పెట్టుబడి కాల పరిమితి ఐదేళ్లు. ఈ ఖాతాలను ఒక పోస్టాఫీసు నుంచి మరో చోటకు, ఓ బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు మార్చుకునే సదుపాయం ఉంది. వడ్డీ సంవత్సరానికి 10 వేలు మించితే టీడీఎస్ కట్ చేస్తారు. నెలవారీ ఆదాయ పథకాలు నెలవారీ ఆదాయ పథకాలు కూడా బ్యాంక్ డిపాజిట్లకంటే మంచి వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. నెలవారీ బ్యాంక్ డిపాజిట్లపై మీకు వచ్చే వడ్డీ 7–7.3 శాతం మధ్య ఉంటే , నెలవారీ ఆదాయ పథకాల్లో వచ్చే వడ్డీ 7.8 శాతం ఉంది. పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకంలో డిపాజిట్లపై ఏప్రిల్ 1, 2016 నుంచి 7.4 శాతం వడ్డీ వస్తోంది. ఇది ప్రతి మూడు నెలలకు ఒకసారి కాంపౌండ్ అవుతుంది. డిపాజిట్ చేసిన ఏడాది తరువాత విత్‌డ్రాయల్స్‌కు అనుమతి ఇస్తారు. కనీసం రూ.10 నిల్వతో పోస్టాఫీస్ ఆర్డీని ప్రారంభిచవచ్చు. ఖాతాను చెక్కు, నగదు రూపంలో తెరిచేందుకు వీలుంది. ఖాతాను మైనర్ పేరిట కూడా తెరవచ్చు. నామినేషన్ ఎంచుకునే సౌకర్యం కూడా ఉంది.