Cc road
-
అయ్యగారూ! అభినందనలు
కురవి: మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని ముత్యాలమ్మ కుంట కట్టపై గుడికి వెళ్లేందుకు నిర్మించిన సీసీరోడ్డు కిందిభాగం ఇటీవల కురిసిన వర్షాలకు కోతకు గురికాగా మరమ్మతు చేపట్టారు. కాగా, గత నెల 24న ‘సాక్షి’ప్రధాన సంచికలో ‘కర్ర జారిందా..ప్రాణం గోవిందా’అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి గ్రామ పురోహితుడు బుక్కామఠం వీరన్న స్పందించారు. మంగళవారం తన సొంత ఖర్చులతో మొరం పోయించి జేసీబీ సాయంతో చదును చేయించారు. అలాగే కట్టకింద ధ్వంసమైన బీటీరోడ్డు మరమ్మతులు చేయించారు. కాగా సీసీరోడ్డు కిందిభాగం కోతకు గురై నెలరోజులు దాటినా అధికారులెవరూ స్పందించలేదని..అయ్యగారు మరమ్మతులు చేయించడం అభినందనీయమని గ్రామస్తులు ప్రశంసిస్తున్నారు. -
213 మందికి ఇద్దరు ఎమ్మెల్యేలు.. చిన్న తండాకు పెద్ద తంటాలు!
హన్మకొండ: డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలోని 71 ఇళ్లు, 213 మంది ఓటర్లు కలిగిన ఓ చిన్న తండాకు ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఐదవ వార్డు పరిధి లచ్చాతండా మధ్యలో సీసీ రోడ్డు ఉంటుంది. తండాలోకి వెళ్తుండగా కుడివైపున డోర్నకల్ మున్సిపాలిటీ ఐదవ వార్డు పరిధిలో 40 ఇళ్లు ఉండగా, 140 మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోకి వస్తారు. రోడ్డుకు ఎడమ వైపున లచ్చాతండా ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం, బర్లగూడెం పరిధిలోని 10వ వార్డులో ఉండగా ఇక్కడ 31 ఇళ్లు, 73 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడి ఓటర్లంతా ఇల్లెందు నియోజకవర్గ పరిధిలో ఉన్నారు. తండాలో ఒకే కుటుంబానికి చెందిన వారు విడిపోయి రోడ్డుకు ఇరు పక్కల ఇళ్లు నిర్మించుకోవడంతో తండ్రి కుటుంబం ఓ నియోజకవర్గంలో, కుమారుడి కుటుంబం మరో నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు ఈ తండాకు డోర్నకల్ నియోజకవర్గం నుంచి డీఎస్ రెడ్యానాయక్, ఇల్లెందు నుంచి హరిప్రియ ప్రాతినిథ్యం వహించారు. ఎర్రమట్టితండా.. డోర్నకల్ మున్సిపాలిటీ మూడో వార్డు పరిధిలోని ఎర్రమట్టి తండా, గార్ల మండలం రాజుతండా గ్రా మపంచాయతీలు కలిసి ఉన్నాయి. రోడ్డుకు ఓ వైపు ఎర్రమట్టితండా, మరో వైపు రాజుతండా ఉండగా రెండు తండాలను విడదీస్తూ మధ్యలో రోడ్డు ఉంది. అయితే తండాలు కలిసి ఉన్నా డోర్నకల్, ఇల్లెందు నియోజకవర్గాల పరిధిలో ఉండడం గమనార్హం. -
చీపురుతో చిమ్మితే కంకర తేలుతోంది!
కర్నూలు, కోవెలకుంట్ల: అధికారపార్టీ నాయకుల అవినీతికి అడ్డూ అదుపులేకుండా పోతోంది. పది కాలాల పాటు పదిలంగా ఉండాల్సిన సీసీరోడ్ల నిర్మాణాల్లో అక్రమాలకు పాల్పడ్డారు. చీపురుతో చిమ్మితే కంకర తేలుతుండటంతో రోడ్లు ఎంత నాణ్యతతో నిర్మించారో తెలుస్తోంది. కోవెలకుంట్ల మండలం లింగాల గ్రామంలో రూ.61 లక్షలతో నిర్మించిన సీసీరోడ్లు ప్రారంభించిన ఇరవై రోజులకే కంకర తేలి అధ్వానంగా మారాయి. గ్రామంలోని ఓసీ కాలనీలో రూ.30.10 లక్షలు, ఎస్సీ, బీసీ కాలనీల్లో రూ.30.90 లక్షలతో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ, ఎస్డీఎఫ్ నిధులతో ఇటీవల సీసీరోడ్లు, డ్రైనేజీ ఏర్పాటు చేశారు. నిర్మాణ సమయంలో తగినపాళ్లలో సిమెంట్ కలుపకుండా అధిక భాగం ఇసుక, కంకరతో రోడ్ల నిర్మాణం చేపట్టడంతో రోడ్లు వేసిన కొన్ని రోజులకే దెబ్బతిని కంకర బయట పడింది. గత నెల 24వ తేదీ బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి ఈ రోడ్లకు ప్రారంభో త్సవం చేశారు. సీసీరోడ్లపై ఉదయం, సాయంత్రం వేళల్లో ఆయా కాలనీల్లో ఇళ్ల ముందు చీపురుతో ఊడ్చితే కంకర చిప్స్ వస్తున్నాయని స్థానిక మహిళలు వాపోతున్నారు. రోడ్లపై కంకర బయటపడటంతో రోడ్లపై చెప్పులు లేకుండా నడిచేందుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కంకర పాదాల్లో గుచ్చుకుంటుండటంతో రాకపోకలు సాగించేందుకు అవస్థలు పడుతున్నారు. ఎస్సీ, ఓసీ కాలనీల్లో రోడ్ల నిర్మాణాలను మధ్యలో వదిలేయడంతో పారిశుద్ధ్యం లోపించి దుర్వాసన వస్తోందని కాలనీవాసులు చెబుతున్నారు. సీసీరోడ్ల ప్రారంభోత్సవంలో శిలాఫలకాలు, డ్రమ్స్, డప్పులు, తదితర హంగు, ఆర్భాటాలకు కావాల్సిన మొత్తాన్ని రోడ్ల నిర్మాణానికి కేటాయించిన నిధుల్లో కోత పెట్టాల్సి వస్తోందని అధికారపార్టీకి చెందిన ఓ నాయకుడు తెలిపారు. బిల్లులు నిలుపుదల: గ్రామంలోని ఎస్సీ, బీసీ కాలనీల్లో సీసీరోడ్ల నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించలేదన్న విషయం మా దృష్టికి వచ్చింది. దెబ్బతిన్న రోడ్డు స్థానంలో తిరిగి రోడ్డువేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌కు ఆదేశాలు జారీ చేశాం. మరమ్మతులు చేసేవరకు ఫైనల్ బిల్లు లు చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టాం. – నజీర్ అహమ్మద్, పంచాయతీరాజ్ ఏఈ -
ప్రజల తరఫున నిలదీసే బాధ్యత నాది
నెల్లూరు సిటీ: రోడ్డు పనులు నాణ్యతగా జరగకపోతే ప్రజల తరఫున అధికారులను నిలదీసే బాధ్యత తనదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మాగుంటలేఅవుట్‌లో తారురోడ్డు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి అధికారులను నిలదీసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రూరల్ నియోజకవర్గంలోని భక్తవత్సల్‌నగర్‌లో రోడ్డు నిర్మాణం నాసిరకంగా జరిగిందని ప్రజలు ఫోన్లు, వాట్సాప్ ద్వారా ఎమ్మెల్యేకు తెలియజేశారు. దీంతో సోమవారం ఆయన ఆ ప్రాంతంలో పరిశీలించారు. ఆయనతో పాటు పబ్లిక్ హెల్త్ ఈఈ వెంకటేశ్వర్లు, డీఈఈ దేవికలు ఉన్నారు. ఈ క్రమంలో పనులు ఏ విధంగా జరిగాయో స్థానికులు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో తెలియజేశారు. దీంతో బీవీనగర్‌లో రోడ్డు పగుళ్లిచ్చింది వాస్తవమేనని ఈఈ ఒప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.1,100 కోట్లతో భూగర్భ డ్రెయినేజీ, తాగునీటి పథకాల పేరుతో ప్రజల డబ్బును అధికారులు, కాంట్రాక్టర్లు దోచేస్తున్నారని మండిపడ్డారు. బీవీనగర్‌లో రోడ్డు వేసి నెలరోజులు కాకముందే పగుళ్లు వచ్చాయన్నారు. ప్లాట్ వైబరేటర్ను వినియోగించకుండానే కాంట్రాక్టర్లు పనులు చేస్తున్నారని తెలిపారు. బయటినుంచి ట్యాంకర్ ద్వారా నీటిని తెచ్చి క్యూరిఫై చేయాలన్నారు. అయితే రోడ్డు వేసి ఒక్కరోజు గడవకముందే దానిపైకి ట్యాంకర్లు తీసుకువచ్చి క్యూరిఫై చేస్తే పగుళ్లు రావా అని అధికారులను అడిగారు. ఎమ్మెల్యే రోడ్డుపైకి వస్తే కానీ పనుల్లో నిబంధనలు పాటించాలని తెలియదా అని ప్రశ్నించారు. రూరల్ నియోజకవర్గ పరిధిలో ఎక్కడైనా నాసిరకంగా రోడ్లు, కాలువలు నిర్మిస్తున్నా, అధికారులు స్పందించకపోయినా తనకు ఫోన్ చేస్తే గంట వ్యవధిలో మీముందు ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు. స్థానికులు ఆగ్రహం.. అధికారుల పరుగులు బీవీనగర్‌లో స్థానికులు పనుల గురించి ఎమ్మెల్యేకు చెబుతుండగా ఈఈ వెంకటేశ్వర్లు స్థానికులపై బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. ‘మీకు ఏం తెలుసు?, నువ్వు చూడలేదు, మీరు నన్ను ప్రశ్నించేది ఏంటి’ అని ఎదురుదాడికి దిగారు. దీంతో పలువురు ఒక్కసారిగా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు కాంట్రాక్టర్లకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారి అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేయడంతో పలువురు వెంటపడి అడ్డుకున్నారు. ఈక్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి కల్పించుకుని ప్రజలు ప్రశ్నించినప్పుడు సమధానం చెప్పాలని, ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈఈని స్థానికులు పగుళ్లు వచ్చిన రోడ్డుపై కూర్చోబెట్టి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే సైతం రోడ్డుపైనే కూర్చున్నారు. అనంతరం పబ్లిక్ హెల్త్ ఎస్ఈ మోహన్‌రావుకు ఎమ్మెల్యే ఫోన్ చేసి పరిస్థితి తెలియజేశారు. ఎస్ఈ కూడా రోడ్డు నిర్మాణ పనులు నాసిరకంగా జరిగాయని తన దృష్టికి వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం నగరంలో లేనని, రేపు వస్తానని, బిల్లుల చెల్లింపులు నిలిపివేస్తామని, నాణ్యతతో కూడిన రోడ్డును వేస్తామని హామీఇచ్చారు. కాంట్రాక్టర్ జంప్ బీవీనగర్‌లో రోడ్డు పనుల పరిశీలనకు ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి వస్తున్నారని సమాచారం అందుకున్న కాంట్రాక్టర్, సిబ్బంది పనులను నిలిపివేసి వెళ్లిపోయారు. కోటంరెడ్డి ఎక్కడికి పరిశీలనకు వెళ్తున్న విషయం చివరి వరకు గోప్యంగా ఉంచారు. అయినా కొందరు అధికారులు కాంట్రాక్టర్‌కు చెప్పడంతో పనుల విషయంలో నిలదీస్తారని ఆయన జారుకున్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, కార్పొరేషన్ విప్ బొబ్బల శ్రీనివాసులు యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మాలెం సుధీర్‌కుమార్‌రెడ్డి, నాయకులు మురళీకృష్ణ యాదవ్, మొయిళ్ల సురేష్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, దిలీప్‌రెడ్డి, తాళ్లూరు సురేష్‌బాబు పాల్గొన్నారు. -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు: ఎంపీ
సంగెం(పరకాల) : కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. ఆదివారం మండలంలోని కృష్ణానగర్‌లో నూతనంగా రూ.16 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనం, రూ.30 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే ధర్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పారదర్శకంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందిస్తోందని చెప్పారు. ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడుతూ గ్రామాలకు గతంలో ఎన్నడూ రాని విధంగా ఈ నాలుగేళ్లలో నిధులు మంజూరయ్యాయని, వాటితో చేపట్టే అభివృద్ధి ప్రతిపక్షాలకు కన్పించడం లేదా అని ప్రశ్నించారు. నాలుగైదు రోజుల్లో ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తామని, వచ్చే ఏడాది కాలేశ్వరం నీళ్లు చెరువుల్లో నింపి రెండు పంటలకు అందిస్తామని చెప్పారు. గ్రామస్తుల కోరిక మేరకు అంగన్వాడీ, యాదవ కమ్యూనిటీ భవనాలు, వాటర్ ట్యాంకు, విద్యుత్ స్తంభాలు, రేషన్‌షాపు మంజూరుకు హామీ ఇచ్చారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఎంపీపీ కట్టయ్య, సర్పంచ్ కోడారి రాజమ్మ, ఎంపీటీసీ సభ్యుడు బానోత్ బాలు, ఉపసర్పంచ్ సుబ్బారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సుదర్శన్‌రెడ్డి, మండల కన్వీనర్ నరహరి, నాయకులు వెంకటేశ్వర్రావు, మోహన్ ఎంపీడీఓ భద్రునాయక్, డీఈ మంగ్యానాయక్, ఏఈలు కిష్టయ్య, రాజునాయకులు తదితరులు పాల్గొన్నారు. -
దోపిడీకి ప్లాన్
పాలకొల్లుటౌన్ : ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు తెలుగుదేశం నాయకులకు కల్పతరువుగా మారాయి. కాంట్రాక్టర్లు, అధికారులకు కాసులవర్షం కురిపిస్తున్నాయి. ఇది పాలకొల్లు మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతికి అద్దం పడుతోంది. పాలకొల్లు మున్సిపాలిటీకి ప్రభుత్వం ఎస్సీ సబ్‌ప్లాన్ ద్వారా రూ.18 కోట్లు మంజూరు చేసింది. 2017–18లో ఈ నిధులు ఖర్చు చేయాలి. అయితే మున్సిపల్ అధికారులు పనులకు టెండర్లు ఖరారు చేసి ఏడాది పూర్తవుతున్నా ఇప్పటివరకు ఆ పనులను పూర్తి చేయలేదు. మార్చి నెలాఖరు సమీపిస్తుండడంతో నిధులు తిరిగి వెనక్కు మళ్లుతాయనే భయంతో హడావుడిగా టీడీపీ నాయకులు పనులను వేగవంతం చేశారు. సబ్‌ప్లాన్ చట్టాన్ని కూడా అతిక్రమించి నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలిచ్చి భారీ అవినీతికి పాల్పడుతున్నారు. పాలకొల్లు బెత్లహాంపేటలో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో నాణ్యత లేకుండా నిర్మిస్తున్న సీసీ డ్రెయిన్ 7 ఎస్సీ వార్డులు పాలకొల్లులో మొత్తం 31 వార్డులు ఉన్నాయి. వీటిలో ఏడు ఎస్సీ వార్డులు. ఈ వార్డుల్లో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో డ్రెయినేజీ, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పిం చాల్సిన బాధ్యత మున్సిపాలిటీపై ఉంది. జనాభాలో 40శాతం ఎస్సీలు ఉన్న ప్రాంతాల్లో ఈ నిధులు వాడాలి. టీడీపీ నేతల కోసం రోడ్డు అయితే ఎస్సీలు 10శాతం కూడా లేని ప్రాంతాల్లో పనులు చేపడుతున్నారు. వాస్తవానికి 17, 18 వార్డుల్లో ఎస్సీలు పదిశాతం కూడా ఉండరు. ఇలాంటిచోట పలువురు టీడీపీ నాయకులు వారి పొలాలను రియల్ఎస్టేట్ వ్యాపారంగా మార్చుకోవడానికి రూ.50లక్షల సబ్‌ప్లాన్ నిధులతో నిబంధనలకు విరుద్ధంగా బీటీ రోడ్డు నిర్మించారు. దీంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్డు నిర్మాణంతో ఇప్పటికే ఈ ప్రాంతంలో అనేక పొలాలు, కొబ్బరితోటలు తొలగించి చకాచకా లేఅవుట్లకు సిద్ధం చేస్తున్నారు. నాసిరకంగా పనులు ఇదిలా ఉంటే 18వ వార్డు బెత్లహాంపేట, 16వ వార్డులో ఎస్సీ సబ్‌ప్లాన్, మున్సిపల్ జనరల్ ఫండ్ దాదాపు రూ.4కోట్లతో నిర్మితమవుతున్న రోడ్లు, సీసీ డ్రెయిన్ నిర్మాణ పనులు నాసిరకంగా జరుగుతున్నాయి. దీనిలో భారీ అవినీతి జరుగుతున్నట్టు సమాచారం. కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కైనట్టు తెలుస్తోంది. నాసిరకం సిమెంటు వినియోగిస్తున్నట్టు సమాచారం. ఇసుకపాళ్లు ఎక్కువ వేసి తూతూమంత్రంగా పనులు చేపట్టినట్టు స్థానికులు విమర్శిస్తున్నారు. ఫలితంగా వేసిన 2రోజులకే రోడ్డు, డ్రెయిన్లు బీటలు తీశాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని ఎస్సీవార్డుల్లో డ్రెయినేజీ నిర్మాణం లేకుండా హడావుడిగా రోడ్డు నిర్మాణాలు చేపట్టారని స్థానికులు చెబుతున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు రూ.కోటి వ్యయంతో 16వ వార్డులో నిర్మిస్తున్న డ్రెయిన్ దృశ్యం టీడీపీ నేతల కనుసన్నల్లోనే పట్టణంలో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో చేపట్టిన పనులన్నీ టీడీపీ నేతల కనుసన్నల్లోనే జరుగుతున్నట్టు సమాచారం. నాసిరకంగా పనులు చేపట్టడంపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. అయినా ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. పనులు జరుగుతున్న ఎస్సీ వార్డుల్లో ఆ ప్రాంతాలకు చెందిన కొంతమంది టీడీపీ వార్డు కౌన్సిలర్లు నాయకులు కాంట్రాక్టర్లు తమను ప్రసన్నం చేసుకోకపోతే బిల్లులు నిలిపేస్తామని బెదిరింపులకు దిగుతున్నట్టు సమాచారం. కొంతమంది టీడీపీ నేతలు డబ్బులు చేతిలో పడితేగానీ పనులు సాగనీయడం లేదని ™ లుస్తోంది. వీటిపై మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో ప్రతిపక్ష నేత యడ్ల తాతాజీ అనేకసార్లు మున్సిపల్ చైర్మన్ వల్లభు నారాయణమూర్తి, కొందరు టీడీపీ నేతలపై ధ్వజమెత్తారు. వారు రియల్ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి రూ.50లక్షలు సబ్‌ప్లాన్ నిధులతో రోడ్డు నిర్మించారని విమర్శించారు. దీనిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పోరాడినా ఫలితం లేదు. 7 వార్డుల్లో 86 పనులు పాలకొల్లు మున్సిపాలిటీలో 7వార్డుల్లో 86 పనులను చేపట్టారు. ప్రస్తుతం 48పనులు నూరుశాతం పూర్తికాగా మరో 38 పనులు 75శాతం పూర్తయ్యాయని మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. మార్చి 15లోపు మిగిలిన పనులు పూర్తిచేస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 10, 11, 15, 21, 31 వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతాప్రమాణాలకు కాంట్రాక్టర్లు తిలోదకాలిచ్చినా అధికారులు పట్టించుకోని దుస్థితి నెలకొంది. రెండు రోజులకే బీటలు బెత్లహాంపేటలో డ్రెయిన్ నిర్మాణం చేపట్టారు. అయితే 2రోజులకే ఎక్కడికక్కడ కాంక్రీటు రాలిపోయింది. ప్లాస్టరింగ్ కూడా చేయలేదు. డ్రెయిన్ మార్జిన్ పూడ్చమని అడిగితే ఎవరింటిముందు వాళ్లే పూడ్చుకోవాలని చెబుతున్నారు. ఇది చాలా దారుణం. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలి. – షేక్ మీరాఉద్దీన్, బెత్లహాంపేట, డ్రెయిన్ లేకుండానే రోడ్డు మా వార్డులో అధికారులు సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. అయితే డ్రెయినేజీ లేకుండా రోడ్డు ఎలా నిర్మిస్తారని అడిగితే రోడ్డు పూర్తయ్యాక డ్రెయిన్ నిర్మిస్తామని అధికారులు చెబుతున్నారు. డ్రెయిన్ నిర్మాణం లేకుండా రోడ్డువేస్తే కుంగిపోతుంది. డ్రెయినేజీ లేకపోవడం వల్ల ఎక్కడి మురుగు అక్కడే ఉంటుంది. పందులు, దోమలు పెరిగి అనారోగ్యం పాలవుతున్నాం. ఇది చాలా దారుణం. అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి. – నగరపు సత్తెమ్మ, రాజీవ్‌నగర్ కాలనీ, పర్యవేక్షిస్తున్నారు పాలకొల్లు మున్సిపాలిటీలో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం జరుగుతోంది. ఈ పనుల్లో నాణ్యతాప్రమాణాలను ఎప్పటికప్పుడు ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పనుల్లో ఎక్కడైనే నాణ్యత లోపించినట్లు గుర్తిస్తే ఆ పనులకు బిల్లులు నిలిపివేస్తాం. క్వాలిటీ కంట్రోల్, థర్డ్ పార్టీతో నాణ్యత ప్రమాణాల పరిశీలన అనంతరమే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తాం. నాణ్యత ప్రమాణాలు లోపించిన చోట ప్రజలు గమనించి తమ దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటాం. – ఎ.రామ్మోహనరావు, మున్సిపల్ కమీషనర్, పాలకొల్లు -
అధికారపార్టీలో ఉండి సిగ్గుగా ఉంది సార్!
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు టౌన్ : ‘సార్ నేషనల్ హైవేపై మా గ్రామం ఉంది. 6 వేల మంది జనాభా, 4,800 ఓట్లు ఉన్నాయి. అధికారపార్టీ సర్పంచ్‌గా ఉండి ఒక్క పని కూడా చేయలేకపోతున్నా, సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఉంది’’ అని దువ్వూరు మండలం గుడిపాడు సర్పంచ్ కొండారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక రింగ్‌రోడ్డులో ఉన్న శ్రీదేవి ఫంక్షన్ హాల్లో జమ్మలమడుగు డివిజన్ స్థాయి సమావేశంలో సర్పంచ్ కొండారెడ్డి మాట్లాడుతూ తమ గ్రామ పరిస్థితి చూస్తే బాధేస్తోందని వాపోయారు. గత కలెక్టర్ సత్యనారాయణకు గ్రామంలో రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు నిధులు మంజూరుచేయాలని నివేదికను ఇచ్చామని, ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేష్‌బాబును కలిశామని, రూ.80లక్షలు ఇచ్చినా ఎస్సీకాలనీలో సీసీరోడ్లు నిర్మించుకోలేకపోయామని చెప్పారు. తమకు ఉపాధి హామీ పథకం నిధులు మంజూరు చేయలేదని వాపోయారు. ఇంత నిస్సాహాయ స్థితిలో ఉన్నానని సర్పంచ్ చెప్పడంతో మంత్రి ఆదినారాయణరెడ్డి కలుగజేసుకుని డివిజన్లో 175 గ్రామపంచాయతీలకు సంబంధించి సమస్యలు, ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి చెప్పాలి తప్ప మీ ఒక్క గ్రామం గురించి మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ మాట్లాడుతూ మంత్రి లోకేష్ రూ.కోటి విడుదల చేయాలని చెప్పారని, అయితే గ్రామంలో ఎవరూ ఉపాధి హామీ పనులు చేయకపోవడం వల్ల ఆ నిధులు రాలేదని చెప్పారు. చట్టానికి లోబడే నిధులు విడుదలవుతాయని, పనులు చేయకుండా నిధులు రావాలంటే ఎలా అని అన్నారు. సర్పంచ్ కొండారెడ్డి మాట్లాడుతుండగా అధికారులు మైక్ తీసుకున్నారు. -
కాకినాడలో తమ్ముళ్ల గూండాగిరి
-
కాకినాడ ఎమ్మెల్యే అనుచరులపై కేసు నమోదు
-
ఎమ్మెల్యే పేరెలా పెడతారు?
అర్తమూరు (మండపేట): ప్రభుత్వ నిధులతో నిర్మించిన సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే పేరు పెట్టడమేంటీ? అని ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ నేత కర్రి పాపారాయుడిపై అధికార పార్టీ నేత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి వీరంగం చేశారు. పక్కకు గెంటివేసి పరుష పదజాలంతో దూషించారు. అధికార జులుం ప్రదర్శించారు. దీంతో వీర్రెడ్డి తీరును నిరసిస్తూ వైఎస్సార్ సీపీ నేతలు ఆందోళనకు దిగారు. పంచాయతీ కార్యాలయం వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు. మండపేట మండలం అర్తమూరు నుంచి అనపర్తి వెళ్లే రోడ్డులోని ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్టు కార్యాలయం సెంటర్ నుంచి తుల్యభాగ నది వరకు సుమారు 1.5 కిలోమీటర్ల మేర సీసీ రోడ్డు నిర్మించారు. మొత్తం రూ.కోటి రూపాయల వ్యయానికిగాను ఉపాధి హామీ నిధులు రూ.76 లక్షలు, పంచాయతీ నిధులు రూ.12 లక్షలు, ఎస్డీఎఫ్ నిధులు రూ.12 లక్షలు మంజూరయ్యాయి. ఈ రోడ్డును ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుతో ప్రారంభింపజేసేలా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, అధికారపార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాదు రోడ్డుకు ఆయన పేరు పెడుతూ ఫ్లెక్సీ ఏర్పాటుచేశారు. దీనిపై వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు పంచాయతీ కార్యాలయానికి చేరుకుని గ్రామ కార్యదర్శి శ్రీనివాస్‌ను ప్రశ్నించారు. ఎమ్మెల్యే పేరు పెడుతూ పంచాయతీ తీర్మానం చేశారా? గ్రామసభ ఎప్పుడు పెట్టారో చెప్పాలని కోరారు. పంచాయతీ తీర్మానం ఉందని, లిఖిత పూర్వకంగా దరఖాస్తు చేసుకుంటే సమాచారం ఇస్తామని ఈఓ శ్రీనివాస్ పేర్కొన్నారు. గ్రామసభ తేదీ చెప్పాలని పాపారాయుడు కోరగా అందుకు ఈఓ శ్రీనివాస్ సరైన సమాధానం చెప్పకుండా బయటకు వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. దీంతో పాపారాయుడు పంచాయతీ గుమ్మం వద్ద బైఠాయించారు. ఇంతలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వీర్రెడ్డి పంచాయతీ కార్యాలయానికి చేరుకుని ప్రారంభోత్సవ ఏర్పాట్లు చూడమంటూ ఈఓ శ్రీనివాస్‌ను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. తనకు సమాధానం చెప్పాలంటూ పాపారాయుడు ఈఓను అడ్డుకునే ప్రయత్నం చేయగా వీర్రెడ్డి ఆయనను పక్కకు గెంటి పరుష పదజాలంతో దూషించా రు. దీంతో ఇరువురు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొవ్వూరి గంగిరెడ్డి, సత్తి సాహెబ్‌రెడ్డి, ద్వారంపూడి బులివీర్రెడ్డి, కర్రి సత్యం, కర్రి సురేష్‌రెడ్డి తదితరులు వీర్రెడ్డిని వారించే ప్రయత్నం చేశారు. వీర్రెడ్డి దౌర్జన్యాన్ని నిరసిస్తూ పాపారాయుడు, తదితరులు పంచాయతీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. విషయం తెలిసి వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దూలం వెంకన్నబాబు, పార్టీ నాయకులు పిల్లా వీరబాబు, తుపాకుల ప్రసన్నకుమార్ తదితరులు గ్రామానికి చేరుకుని ధర్నాలో పాల్గొన్నారు. ధర్నా అనంతరం పాపారాయుడు, వెంకన్నబాబు, పార్టీ నాయకులు మాట్లాడుతూ వీర్రెడ్డి వైఖ రిని తీవ్రంగా ఖం డించారు. అధికారపార్టీ నేతల దౌర్జన్యాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళతానని పాపారాయు డు తెలిపారు. -
ఇదేం పాడుపని!
తారు రోడైనా, సీసీ రోడ్డు నిర్మించినా బెర్ములు వేయడం ఎంతోఅవసరం. బెర్ములు లేకపోతే ఎంత నాణ్యతతో నిర్మించిన రోడ్డయినా త్వరగా పాడవ్వడం ఖాయం. కంకర మట్టితో బెర్ములు వేస్తేనే ఉపయోగం ఉంటుంది. కానీ శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఇలాకాలో.. ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్డుకు ఇరువైపులా వేస్తున్న బెర్ములను చూస్తే ఆశ్చర్యం కలిగిస్తోంది. రోడ్డు పక్కన బురదమట్టినే జేసీబీలతో తవ్వేసి బెర్ములుగా వేసి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు కాంట్రాక్టర్లు. ఈ మట్టిని కూడా స్థల యజమానుల అనుమతి లేకుండానే తవ్వేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. అరసవల్లి(శ్రీకాకుళం): జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం పట్టణంలోని అరసవల్లిలో జరుగుతున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులు నిబంధనల మేరకు జరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కాజీపేట పంచాయతీ ఆదిత్యనగర్ కాలనీలో సుమారు ఆరు కోట్ల రూపాయల ఉపాధి హామీపథకం నిధులతో సీసీ రోడ్లను నిర్మిస్తున్నారు. అయితే నిబంధనల ప్రకారం పనులు జరగడం లేదు. అధికార పార్టీ నేతల అండదండలతో, స్థానిక నేతల ప్రోత్సాహంతో అధికారుల కళ్లు గప్పి కంట్రాక్టర్లు ఇష్టానుసారంగా పనులు చేపడుతున్నారు. నిబంధనల ప్రకారం సీసీ రోడ్లకు ఇరువైపులా సంబంధిత కాంట్రాక్టర్లు కచ్చితంగా బెర్ములను ఎర్ర కంకర మట్టితో నిర్మించాల్సి ఉంటుంది. అందుబాటులో లేకపోతే దూరం నుంచైనా వాహనాలతో తెచ్చి వేయాల్సిన బాధ్యత కాంట్రాక్టర?్ద. అయితే ఇక్కడ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు మాత్రం రోడ్డుకు ఇరువైపులా ప్రైవేటు వ్యక్తుల స్థలాల్లోని బురదమట్టినే నాలుగైదు జేసీబీలతో తీయించి రోడ్డు సైడ్ బెర్ములుగా వేస్తున్నారు. ఈ మట్టికి కూడా బిల్లులు పెట్టి సొమ్ము చేసుకోవాలని కాంట్రాక్టర్లు చూస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. బెర్ములుగా వేస్తున్నది బురదమట్టి కావడంతో వర్షం పడితే ఇబ్బందులు తప్పవని స్థానికులు వాపోతున్నారు. అలాగే అనుమతి కూడా తీసుకోకుండా తమ స్థలాల్లోని మట్టిని తవ్వేయడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సరిహద్దులు తొలగించి మరీ! సీసీ రోడ్లకు బెర్ముల కోసం ఇళ్ల స్థలాల్లోని మట్టిని తవ్వేయడంపై స్థల యజమానులు గగ్గోలు పెడుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆదిత్యనగర్ కాలనీ విస్తరించడంతో పాటు సూర్యదేవాలయ ఖ్యాతి మరింత పెరగడంతో ఇక్కడి భూములకు డిమాండ్ ఉంది. లక్షలాది రూపాయలతో చాలామంది స్థలాలు కొనుగోలు చేసి ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే తాజాగా సీసీ రోడ్లకు బెర్ములు వేసేందుకు మట్టిని తవ్వేసే ప్రయత్నంలో ఇంటి స్థలాల మధ్య సరిహద్దు రాళ్లు, పిల్లర్లను సైతం తొలగిస్తుండడంతో స్థల యజమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అనుమతి లేకుండా దౌర్జన్యంగా మట్టిని తవ్వేయడం ఎంతవరకు సమంజసమంటూ నిలదీస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గోతులు మా డబ్బులతో పూడ్చుకోవాలా? ఇంటి కోసం స్థలం కొనుగోలు చేశాను. ఇప్పుడు మా స్థలాల్లో మట్టి కోసం పెద్ద గోతులు తవ్వేశారు. ఇదేమిటని అడిగితే పట్టించుకోవడం లేదు. ఆ గోతులను పూడ్చుకోవాలంటే వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇదెక్కడి న్యాయమో నేతలే చెప్పాలి. అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలి. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకూడదు. – ప్రభాకరరావు, రిటైర్డ్ ఉద్యోగి అలా చేయడం కరెక్ట్ కాదు రోడ్లకు బెర్ముల నిర్మాణం బాధ్యత కాంట్రాక్టర్‌దే. అలాగని ఇళ్ల స్థలాల మట్టిని తీసేసి బెర్ముల నిర్మాణం చేయకూడదు. బెర్ములను వేయిస్తేనే బిల్లులు చెల్లిస్తామని చెప్పాం. అయితే ఇలా జరుగుతుందని ఇప్పుడే నా దృష్టికి వచ్చింది. సంబంధిత ఏఈతో విచారణ చేయించి తగు చర్యలు చేపడతాను. – కె.నర్సింహమూర్తి, డీఈ, పంచాయతీరాజ్ -
పనులు సరే.. బిల్లులేవి?
గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తి చేసి నెలలు గడుస్తున్నా..అందుకు సంబంధించిన బిల్లులు అందని దుస్థితి నెలకొంది. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి నెల ముగుస్తుంది...నెలాఖరులోపు సీసీ రోడ్డు వేస్తేనే బిల్లులు వస్తాయని లేకుంటే..ఎన్ఆర్ఈజీఎస్ నిధులు వెనక్కిపోతాయని అధికారులు చెప్పడంతో అప్పులు తెచ్చి మరీ సదరు కాంట్రాక్టర్లు, నాయకులు గ్రామాల్లో పనులు పూర్తి చేశారు. కానీ ఇప్పుడు బిల్లులు మంజూరు కాకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే బిల్లులు విడుదల చేయాలని వేడుకుంటున్నారు. సూర్యాపేటరూరల్ : సూర్యాపేట మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు 3 కోట్ల 60 లక్షల రూపాయలతో 28 సీసీ రోడ్లు వేశారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం శాఖ అధికారులు 90 శాతం పనులను మార్చి నెలాఖరులోపు సదరు కాంట్రాక్టర్లతో పూర్తి చేయించారు. మార్చి 31లోపు చేసిన పనులకు ఎంబీ రికార్డులు చేశారు. వారం రోజుల్లో బిల్లులు వస్తాయని అధికారులు చెప్పారని, నెలలు దాటినా బిల్లులు అందలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు చేయించేందుకు వడ్డీ వ్యాపారుల వద్ద డబ్బులు, సిమెంట్ వ్యాపారుల వద్ద సిమెంట్ తెచ్చి సీసీ రోడ్లు పోయించామని.. ఇప్పుడు బిల్లులు రాకపోవడంతో వారు డబ్బులివ్వాలని ఒత్తిడి చేస్తున్నారని సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టిన నాయకులు, కాంట్రాక్టర్లు వాపోతున్నారు. కృషియల్ బ్యాలెన్స్ నిధులదీ అదే పరిస్థితి.. కృషియల్ బ్యాలెన్స్ (సీబీఎఫ్) నిధులు రూ.50 లక్షలతో సూర్యాపేట మండలంలోని రత్నపురం, బాలెంల గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో గాను 10 సీసీ రోడ్లు నూతనంగా వేశారు. ఒక్కో రోడ్డుకు రూ.5లక్షలు కేటాయించారు. రూ.5లక్షల పని చేస్తే అంతో ఇంతో డబ్బులు మిగులుతాయనే ఆశతో చోటామోటా నాయకులు సీసీ రోడ్లకు సంబంధించిన పనులు చేసి 8 నెలలకు పైగా అవుతాన్నా... బిల్లులు మాత్రం అందడం లేదు. దీంతో రోడ్ల నిర్మాణానికి తీసుకొచ్చిన డబ్బులకు వడ్డీలు పెరుగుతున్నాయని వాపోతున్నారు. ఇప్పటిౖMðనా సంబంధిత అధికారులు చొరవ చూపి ప్రభుత్వం, సంబంధితశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్ల బిల్లులు విడుదల చేయించాలని పలువురు కోరుతున్నారు. త్వరలోనే అందుతాయి సీసీ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన పెండింగ్ బిల్లులు త్వరలోనే అందుతాయి. పెండింగ్‌లో ఉన్న బిల్లులు మంజూరు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొద్ది రోజుల్లోనే బిల్లులు విడుదల కానున్నాయి. – మనోహార్, పంచాయతీరాజ్ ఏఈ, సూర్యాపేట -
కనిపించని కనీస సౌకర్యాలు
మునుగోడు : పేరుగొప్పు ఊరు దిబ్బ అన్నట్టుగా ఉంది మునుగోడు మండలకేంద్రం పరిస్థితి. పేరుకే నియోజకవర్గకేంద్రం కానీ ఇక్కడ కనీసం సౌకర్యాలు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేదు. సీసీ రోడ్ల నిర్మాణం కూడా అంతంత మాత్రమే.. ఏ వీధిలో కూడా సరిగ్గా మురికి కాల్వలు లేకపోవడంతో చిన్నపాటి వర్షమెుస్తేచాలు మురికి కూపాలుగా దర్శనమిస్తున్నాయి. దీంతో వివిధ కాలనీలోని ఇళ్ల చుట్టూ మురికి నీరు నిలిచి బురదమడుగులు, కుంటలను తలపిస్తున్నాయి. ఇక కొత్తగా ఏర్పడుతున్న కాలనీలనైతే పట్టించుకునే నాథులే లేకుండా పోయారు. ఫలితంగా దోమలు, ఈగలు ప్రబలుతుండడంతో జనం విషజ్వరాల బారిన పడుతున్నారు. కొందరు డెంగీ వ్యాధి లక్షణాలో ఆస్పత్రుల పాలై వైద్యసేవలు పొందుతున్నారు. అయినా సంబంధిత పంచాయతీఅధికారులు, పాలకులు తమకేమీ పట్టనట్లు వ్యహరిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా వీధుల్లో నీరు నిల్వ ఉండకుండా మురుగుకాల్వలు నిర్మించాలని చండూరురోడ్డు, ఇందిరమ్మ, జర్నలిస్టు కాలనీల ప్రజలు కోరుతున్నారు. -
పొంచి ఉన్న ప్రమాదం
రాయికోడ్: మండల కేంద్రమైన రాయికోడ్‌లో 190 మీటర్ల పొడవున నూతనంగా సీసీ రోడ్డును నిర్మిస్తున్నారు. నిర్మాణం పనులు గత కొన్ని రోజులుగా కొనసాగుతున్నాయి. రోడ్డు నిర్మాణ పనులతో వాహనాలను స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట నుంచి దారి మళ్లించారు. తహసీల్దార్ కార్యాలయ సమీపం మీదుగా గ్రామంలోని ప్రధాన కూడలి వద్దకు మళ్లించారు. బైపాస్ దారికి ఏ మాత్రం మరమ్మతులు చేయకుండానే వాహనాలను మళ్లించారు. ప్రస్తుతం వాహనాలను దారి మళ్లించిన మార్గంలోని పలు ప్రాంతాల్లో మూలమలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో రోడ్డు ఏ మాత్రం ప్రయాణానికి పనికి రాకుండా ఉంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సూచిక బోర్డులు సైతం ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులు ఎటు వైపు నుంచి నడపాలో తెలియక అవస్థలు పడుతున్నారు. మూలమలుపుల వద్ద ఆదివారం ఓ కారు ప్రమాదానికి గురైంది. పలువురు ద్విచక్ర వాహనదారులు మూలమలుపుల వద్ద ప్రమాదాలకు గురయ్యారు. మహమ్మదాపూర్ ప్రధాన రహదారి సమీపంలో గల మూలమలుపు వద్ద పలు లారీలు గుంతల్లో ఇరుక్కుపోయాయి. వీటిని జేసీబీల ద్వారా బయటకు లాగడానికి రూ.వేలల్లో ఖర్చయినట్లు డ్రైవర్లు తెలిపారు. ప్రమాదాల్లో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఇటీవల జహీరాబాద్ డిపోకు చెందిన హైదారాబాద్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ బస్సు మూలమలుపు వద్ద అదుపు తప్పింది. అప్రమత్తమైన డ్రైవర్ ప్రమాదం జరగకుండా జాగ్రత్త పడ్డాడు. నిత్యం ప్రయాణికులు అవస్థలు పడుతున్నా సంబంధిత అధికారులు ప్రత్యామ్నాయ రహదారిని సక్రమంగా సిద్ధం చేయడంలేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
సీసీ రోడ్ల పనులు ప్రారంభం
గౌరాయపల్లి(యాదగిరిగుట్ట): మండలంలోని గౌరాయపల్లిలో శుక్రవారం రూ.3.50లక్షల మండల పరిషత్ నిధులతో మంజూరైన సీసీ రోడ్లకు యాదగిరిగుట్ట ఎంపీపీ గడ్డమీది స్వప్న, జెడ్పీటీసీ కర్రె కమలమ్మ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి గ్రామంలోని ప్రతీ వీధిలో సీసీ మెటల్ రోడ్లు వేయడానికి కృషి చేస్తానన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెలను అభివృద్ధి చేసేందుకు సీసీ రోడ్లు, మిషన్ భగీరథ వంటి పనులు చేపడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ బోగ భాగ్యలక్ష్మీ, ఎంపీటీసీ బరిగే అరుణబాలయ్య, ఉపసర్పంచ్ బైర శ్రీరాములు, వార్డు సభ్యులు అయిలయ్య, సత్యం, శ్రీను, కవిత, రజిత తదితరులున్నారు. -
సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
త్రిపురవరం(నడిగూడెం): మండల పరిధిలోని త్రిపురవరంలో ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణపు పనులను మంగళవారం ఆ గ్రామ సర్పంచ్ పందిరి పాపిరెడ్డి ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు. త్రిపురవరం గ్రామ అభివృద్ధికి ఎమ్యెల్యే ఉత్తమ్ పద్మావతి నిధులను కెటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెట్పీటీసీ సభ్యుడు వల్లపురెడ్డి వీరారెడ్డి, ఆ గ్రామ మాజీ సర్పంచ్‌లు మందడి రంగారెడ్డి, కొత్త వెంకటరెడ్డి, ఎడమ కాల్వ మాజీ చైర్మన్ సీహెచ్.లక్ష్మినారాయణరెడ్డి, గుర్రం వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అద్యక్షుడు దేవబత్తిని వెంకటనర్సయ్య, కాంగ్రెస్ పార్టీ రైతు సంఘం మండల కన్వీనర్ మన్నెం అనంతరెడ్డి, కొత్త నారాయణరెడ్డి, షేక్.సైదులు, గుర్వయ్య, పంచాయతి రాజ్ ఏఈ గార్లపాటి వెంకటరెడ్డి, జేఈ నయీం, తదితరులు పాల్గొన్నారు. -
సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
హుజూర్నగర్ : పట్టణంలోని 16వ వార్డులో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను బుధవారం నగర పంచాయతీ చైర్మన్ జక్కుల వెంకయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరపంచాయతీ పరిధిలో అంతర్గత రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతలను ప్రతి ఒక్కరూ చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్‌గౌడ్, కౌన్సిలర్లు తన్నీరు మల్లికార్జున్‌రావు, దొంతిరెడ్డి సంజీవరెడ్డి, మీసాల కిరణ్, పిల్లి శ్రీనివాస్, నాయకులు బ్రహ్మారెడ్డి, శ్రీను, కృష్ణ, సోమయ్య, వెంకన్న, సతీశ్, బాబూరావు పాల్గొన్నారు. మండలంలో... మండలంలోని కరక్కాయలగూడెంలో రూ. 7 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను బుధవారం ఎంపీపీ గొట్టెముక్కల నిర్మల, స్థానిక సర్పంచ్ దొంగరి అరుణ సత్యనారాయణతో కలసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు యరగాని నాగన్నగౌడ్, కాంగ్రెస్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండి.నిజాముద్దీన్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్‌కుమార్ దేశ్‌ముఖ్, ఉపసర్పంచ్ వెంకటేశ్వర్లు, గూడెపు శ్రీను, బత్తిని మాధవరావు, అంకతి లక్ష్మీనారాయణ, కె.వెంకటేశ్వర్లు, సీహెచ్.వీరబాబు, సైదయ్య పాల్గొన్నారు. -
గోళ్లపాడు ఛానల్ కాల్వను పునరుద్ధరించాలి
-
అడ్డగోలు పనులు..
ఇక్కడ కనిపిస్తున్న రోడ్డు నిర్మాణ పనులు ఆదిలాబాద్ పట్టణంలో జరుగుతున్నాయి. లేడీస్ క్లబ్ నుంచి కాన్వెంట్ స్కూల్ వరకు సీసీ రోడ్డు వేస్తున్నారు. రూ.లక్షలు వెచ్చించి నిర్మిస్తున్న ఈ పనులకు మున్సిపాలిటీ నుంచే కాదు, ఏ శాఖ నుంచీ నిధులు మంజూరు కాలేదు. ఇంజినీరింగ్ అధికారులు అంచనాలు రూపొందించలేదు. అసలు ప్రతిపాదనలే లేవు.. టెండర్లు పిలువలేదు. మరి ఈ పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌కు బిల్లులెవరిస్తారు..? అధికారంలో ఉన్నాం కదా.. ఎలాగైనా డ్రా చేసుకోవచ్చనే ధీమాతో అధికార పార్టీ ప్రజాప్రతినిధి, అనుచరులు చేపట్టిన అక్రమ పనులివి. సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాలో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల బరితెగింపు షురువైంది. అధికారంలో ఉన్నాం కదా తమను అడిగే నాథుడెవరుంటారనే ధీమాతో అడ్డగోలు పనులకు శ్రీకారం చుట్టారు. స్థానిక ప్రజల అవసరాలతో నిమిత్తం లేకుండా, తన నివాసానికి రాకపోకలకు అసౌకర్యం కలుగద్ద నే భావనతో ఓ నేత తన అనుచరులతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టా రు. ఈ పనులకు ఎలాంటి మంజూరు లేదు. అంచనాలు.. టెండర్లు.. అ గ్రిమెంట్లు.. ఇలా నిబంధనలన్నింటి నీ తుంగలో తొక్కి పనులు చేపట్టా రు. పట్టణ నడిబొడ్డున రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు కట్టి ఈ పనులు చేస్తున్నారు. అధికారులంతా మన చెప్పుచేతల్లో ఉండే వారే కదా.. ఎలాగైనా బిల్లులు డ్రా చేసుకోవచ్చనే ధీమాతో ఈ అడ్డగోలు వ్యవహారానికి తెర లేపారు. సాధారణంగా నల్ల కనెక్షన్ పైపు కోసం సామాన్యుడు చి న్నగా రోడ్డును తవ్వితే.. వెంటనే అక్కడ వాలిపోయి నానా హంగామా చేసే మున్సిపల్ అధికారులు.. ఏకంగా పట్టణ నడిబొడ్డున ప్రైవేటు వ్య క్తులు వందల మీటర్ల మున్సిపల్ రోడ్డును తవ్వేసి సీసీ రోడ్డును నిర్మిస్తుంటే అటువైపు కన్నెత్తి కూడా చూడటంలేదు. ‘నేతల వ్యవహారం.. మనకెందుకొచ్చిన గొడవ..’ అనుకుంటూ చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. రోడ్డు మీద రోడ్డు.. ఈ అడ్డగోలు పనులు జరుగుతున్న ఈ రోడ్డును కొన్ని నెలల క్రితమే మున్సిపల్ అధికారులు రూ.లక్షలు వెచ్చించి నిర్మించారు. బిల్డింగ్ పీనలైజేషన్ పథకం కింద వచ్చిన నిధులతో సుమారు ఏడు నెలల క్రితమే మెటల్ రోడ్డు వేశారు. ఇప్పుడు మళ్లీ ఇదే రోడ్డుపై పనులు చేపట్టారు. జిల్లాలో అనేక మారుమూల ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం లేదు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోనే శివారు కాలనీలకు వాహనాలు వెళ్లలేని పరిస్థితి. ఈ సమస్యలను పక్కన బెట్టి ఓ నేత తన స్వప్రయోజనం కో సం ఇష్టారాజ్యంగా పనులు చేపట్టడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. రోడ్డు నిర్మాణానికి నిబంధనలివి.. ఏదైనా అభివృద్ధి పనులు చేపట్టాలంటే ముందుగా ఆ పనులకు సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు అంచనాలు రూపొందించాలి. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాలి. ఈ పనులకు నిధులు మంజూరైతే టెండర్లు నిర్వహించి, కాంట్రాక్టరుతో అగ్రిమెంట్ చేసుకుని వర్క్ ఆర్డర్లు ఇవ్వాలి. కానీ ఈ నిబంధనలేవీ పట్టించుకోకుండానే పనులు జరుగుతుండటం గమనార్హం. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో జరుగుతున్న వ్యవహారం అనుకుంటే పొరపాటే, సాక్షాత్తు కలెక్టర్‌తోపాటు, వివిధ శాఖల ఉన్నతాధికారుల నివాసాలకు వెళ్లే గాంధీ పార్క్ రోడ్డుతో అనుసంధానం ఉన్న రోడ్డు వ్యవహారమే ఇది. అడ్డగోలుగా చేపట్టిన ఈ అక్రమ పనులకు ఏ నిధుల నుంచి బిల్లులు డ్రా చేస్తారో కొద్ది రోజుల్లోనే తేలనుంది. ఆ పనుల గురించి మమ్మల్ని అడగొద్దు.. ఆదిలాబాద్ పట్టణంలో జరుగుతున్న ఈ అడ్డగోలు పనుల విషయమై ‘సాక్షి’ మున్సిపల్ ఇంజనీర్ పి.నాగమల్లేశ్వరరావును వివరణ కోరగా.. పట్టణంలో కాన్వెంట్ స్కూల్ నుంచి లేడీస్క్లబ్ వరకు జరుగుతున్న రోడ్డు పనుల గురించి మమ్మల్ని అడగొద్దు. ఈ రోడ్డు పనులకు మున్సిపాలిటీ నుంచి ఎలాంటి నిధులు మంజూరు కాలేదు. ఈ పనులు ఎవరు చేస్తున్నారో కూడా మాకు తెలియదు అని పేర్కొన్నారు. -
రూ.లక్షలు హాంఫట్
ఫొటోలో కనిపిస్తున్నది ఏదో రియల్ ఎస్టేట్ వెంచర్ అనుకుంటే పొరపాటు. అధికారుల దృష్టిలో ఇది ఎస్సీ, ఎస్టీలు నివసించే ప్రాంతం. అదేంటి అసలు ఇండ్లే లేవు.. ఎవరు నివసిస్తున్నారు అని ప్రశ్నించుకునేరు.? అక్రమాల్లో ఆరితేరిన అధికారుల దృష్టిలో ఇది ఎస్సీ, ఎస్టీ కాలనీనే. ఈ కాలనీలో దళిత, గిరిజనులు నివసిస్తున్నారని రికార్డులు సృష్టించారు. వారికి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఈ సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించినట్లు పేర్కొన్నారు. ఈ సీసీ రోడ్డును చూడండి.. ఎప్పుడో పదేళ్ల క్రితం వేసిన రోడ్డు కాదు.. ఏడాది క్రితమే నిర్మించినా పగుళ్లు తేలి ఇలా తయారైంది. ఈ రోడ్లపై ఇప్పటివరకు ఒక్క వాహనం కూడా తిరిగిన దాఖలాల్లేవు. కానీ.. అప్పుడే ఎక్కడికక్కడ పెచ్చులూడిపోయాయంటే ఆ పనుల్లో నాణ్యత అర్థం చేసుకోవచ్చు. ఘనత వహించిన అధికారులు ఈ పనుల కోసం అక్షరాల సుమారు రూ.69 లక్షలు ఖర్చు చేసినట్లు నిధులు డ్రా చేశారు. సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ప్రజాప్రతినిధులు, నేతలతో చేతులు కలిపి ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా ఖర్చు చేసిన వ్యవహారం ఎట్టకేలకు అధికారుల మెడకే చుట్టుకుంటోంది. ప్రజల అవసరాలతో నిమిత్తం లేకుండా, పర్సెంటేజీలే ధ్యేయంగా నేతలతో చేతులు కలిపి రూ.లక్షల నిధులను పక్కదారి పట్టించిన అక్రమార్కులపై ఎట్టకేలకు పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించింది. వివరాల్లోకి వెళితే.. సమస్యలతో సహజీవనం చేస్తున్న దళిత, గిరిజనులు నివసిస్తున్న ప్రాంతాల అభివృద్ధికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా జిల్లాకు రూ.వందల కోట్లలో నిధులు వచ్చాయి. వీటితో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం చేపట్టారు. మండలానికి ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి ఈ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా తానూరు మండల కేంద్రానికి వచ్చిన రూ.69 లక్షల నిధులను అధికారులు, నేతలు కలిసి పక్కదారి పట్టించారు. తూతూ మంత్రంగా పనులు చేసి దళిత, గిరిజనుల అభివృద్ధికి వినియోగించాల్సిన నిధులను అ ప్పనంగా కాజేశారు. నిబంధనలను తుంగలో తొక్కి పెద్ద ఎత్తున అక్రమాలకు తెరలేపారు. ఉపాధి హామీ చట్టం ప్రకారం ఈ నిధులతో ఎస్సీ, ఎస్టీలు నివసిస్తున్న ప్రాంతాల్లో మాత్రమే పనులు చేపట్టాలి. కానీ స్థానికులను మభ్యపెట్టి బోగస్ తీర్మాణాలు సృష్టించి ఎవ రూ నివాసముండని ఈ నిర్మానుష్య ప్రాంతం లో పనులు చేపట్టారు. దీంతో రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన ఈ పనులతో ఏ ఒక్క దళిత, గిరిజనులకు ప్రయోజనం చేకూరకపోగా, నేతలు, అధికారులు మాత్రం పర్సెంటేజీల రూపంలో జేబులు నింపుకున్నారు. నాణ్యత గాలికి.. ఈ పనుల్లో నాణ్యత ప్రమాణాలను గాలికొదిలేశారు. నేతలతో చేతులు కలపడంతో అడిగే నాథుడే ఉండడని ఇష్టారాజ్యంగా పనులు చేపట్టారు. ఈ సీసీ రోడ్లపై ఒక్క వాహనం కూడా తిరిగిన దాఖలాలు లేకపోయినా ఎక్కడికక్కడ పెచ్చులూడి పోయాయి. ఈ డ్రెయినేజీల్లో పిచ్చిమొక్కలు పెరుగుతున్నాయి. ఈ పనుల్లో నాణ్యత పాటించకపోయినా రూ.లక్షల్లో బిల్లులు డ్రా చేశారు. ఈ వ్యవహారంలో ముథోల్ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. విచారణ చేపట్టిన కమిషనర్ ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో పంచాయతీరాజ్ శాఖ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు రెండు నెలల క్రితం ఈ పనులపై విచారణ చేపట్టిన ఆ శాఖ కమిషనర్ వెంకటేశం ఇటీవల నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. ఈ నివేదిక మేరకు చర్యలకు ఉపక్రమించిన ఆ శాఖ ఉన్నతాధికారులు వివరణ ఇవ్వాలని పంచాయతీరాజ్ నిర్మల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జె.వెంకట్రావును ఆదేశించినట్లు సమాచారం. ఈ పనుల విషయంలో అన్ని నిబంధనల ప్రకారమే జరిగాయని పంచాయతీరాజ్ అధికారులు పేర్కొంటుండటం గమనార్హం.