సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
Published Wed, Aug 3 2016 11:23 PM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM
హుజూర్‌నగర్ : పట్టణంలోని 16వ వార్డులో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను బుధవారం నగర పంచాయతీ చైర్మన్ జక్కుల వెంకయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరపంచాయతీ పరిధిలో అంతర్గత రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతలను ప్రతి ఒక్కరూ చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్‌గౌడ్, కౌన్సిలర్లు తన్నీరు మల్లికార్జున్‌రావు, దొంతిరెడ్డి సంజీవరెడ్డి, మీసాల కిరణ్, పిల్లి శ్రీనివాస్, నాయకులు బ్రహ్మారెడ్డి, శ్రీను, కృష్ణ, సోమయ్య, వెంకన్న, సతీశ్, బాబూరావు పాల్గొన్నారు.
మండలంలో...
మండలంలోని కరక్కాయలగూడెంలో రూ. 7 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను బుధవారం ఎంపీపీ గొట్టెముక్కల నిర్మల, స్థానిక సర్పంచ్ దొంగరి అరుణ సత్యనారాయణతో కలసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు యరగాని నాగన్నగౌడ్, కాంగ్రెస్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండి.నిజాముద్దీన్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్‌కుమార్ దేశ్‌ముఖ్, ఉపసర్పంచ్ వెంకటేశ్వర్లు, గూడెపు శ్రీను, బత్తిని మాధవరావు, అంకతి లక్ష్మీనారాయణ, కె.వెంకటేశ్వర్లు, సీహెచ్.వీరబాబు, సైదయ్య పాల్గొన్నారు.
Advertisement
Advertisement