huzurngar
-
హుజుర్నగర్లో వింత కేసు.. పోలీస్‌స్టేషన్‌కు చేరిన పిల్లి పంచాయితీ..
సాక్షి, హుజూర్నగర్(సూర్యాపేట): ఏడాది క్రితం తప్పిపోయిన పిల్లి మళ్లీ కనబడటంతో రెండు కుటుంబాల మధ్య తగాదాకు దారి తీసింది. పిల్లి తమదంటే తమదంటూ వారు వాగ్వాదానికి దిగి, పరిస్థితి చేయిదాటిపోవడంతో పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారు. ఎస్ఐ చొరవతో సమస్య పరిష్కారమైంది. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని దద్దనాల చెరువు కాలనీలో నివసించే మద్దెల మున్నా, అతని తల్లి ముత్యాలు మూడేళ్ల క్రితం మైసూర్‌నుంచి పిల్లి పిల్లల జంటను రూ 5 వేలకు కొనుగోలు చేసి తెచ్చుకున్నారు. వీటిలో ఆడపిల్లి బావిలోపడి చనిపోగా మగపిల్లి ఏడాది క్రితం తప్పిపోయింది. మున్నా, ముత్యాలు ఎంతవెతికినా ఫలితం లేకపోయింది. అయితే ఇటీవల ఫణిగిరి గుట్ట వద్ద ఓ వ్యక్తి ఆ పిల్లిని చూసి గుర్తుపట్టి మున్నాకు సమాచారమిచ్చాడు. దీంతో వారు పిల్లిని పెంచుకుంటున్న సుక్కమ్మ ఇంటికి వెళ్లి పిల్లి కోసం అడిగారు. ఈక్రమంలోనే ఇరు కుటుంబాల మధ్య మాటామాటా పెరిగి పరిస్థితి చేయిచేసుకునే వరకు వెళ్లింది. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. మున్నా, ముత్యాలుకు రూ 5 వేలను ప్రస్తుతం పిల్లిని సాదుకుంటున్న సుక్కమ్మ ఇచ్చేలా మాట్లాడి ఇరువర్గాలను ఎస్ఐ ఒప్పించారు. దీంతో సమస్య పరిష్కారం అయ్యింది. చదవండి: హైదరాబాద్: మార్చి నాటికి మరో నాలుగు ప్రాజెక్టులు -
హుజూర్‌నగర్‌లో పోటీ చేస్తాం...
సూర్యాపేట: హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి త్వరలో జరగనున్న ఉపఎన్నికల్లో తెలంగాణ ఇంటి పార్టీ పోటీలో ఉంటుందని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చెరుకు సుధాకర్ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్లో జరిగిన పార్టీ ద్వితీయ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. నల్లగొండ ఎంపీగా గెలిచిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి త్వరలోనే రాజీనామా చేస్తారన్న సమాచారం ఉందన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల పొత్తులో భాగంగా ఇంటి పార్టీకి ఒక అసెంబ్లీ స్థానం కేటాయిస్తామని కాంగ్రెస్ మాటిచ్చిందని, అనివార్య కారణాలతో ఇవ్వలేకపోయిందని గుర్తుచేశారు. అయినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి గెలుపు కోసం, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం ఇంటి పార్టీ కృషి చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ పొత్తు ధర్మాన్ని పాటించి హుజూర్‌నగర్‌కు జరిగే ఉప ఎన్నికల్లో తమకు అవకాశం కల్పించాలని కోరారు. -
సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
హుజూర్నగర్ : పట్టణంలోని 16వ వార్డులో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను బుధవారం నగర పంచాయతీ చైర్మన్ జక్కుల వెంకయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరపంచాయతీ పరిధిలో అంతర్గత రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతలను ప్రతి ఒక్కరూ చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్‌గౌడ్, కౌన్సిలర్లు తన్నీరు మల్లికార్జున్‌రావు, దొంతిరెడ్డి సంజీవరెడ్డి, మీసాల కిరణ్, పిల్లి శ్రీనివాస్, నాయకులు బ్రహ్మారెడ్డి, శ్రీను, కృష్ణ, సోమయ్య, వెంకన్న, సతీశ్, బాబూరావు పాల్గొన్నారు. మండలంలో... మండలంలోని కరక్కాయలగూడెంలో రూ. 7 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను బుధవారం ఎంపీపీ గొట్టెముక్కల నిర్మల, స్థానిక సర్పంచ్ దొంగరి అరుణ సత్యనారాయణతో కలసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు యరగాని నాగన్నగౌడ్, కాంగ్రెస్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండి.నిజాముద్దీన్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్‌కుమార్ దేశ్‌ముఖ్, ఉపసర్పంచ్ వెంకటేశ్వర్లు, గూడెపు శ్రీను, బత్తిని మాధవరావు, అంకతి లక్ష్మీనారాయణ, కె.వెంకటేశ్వర్లు, సీహెచ్.వీరబాబు, సైదయ్య పాల్గొన్నారు.