Published
Fri, Aug 19 2016 6:21 PM
| Last Updated on Mon, Sep 4 2017 9:58 AM
సీసీ రోడ్ల పనులు ప్రారంభం
గౌరాయపల్లి(యాదగిరిగుట్ట): మండలంలోని గౌరాయపల్లిలో శుక్రవారం రూ.3.50లక్షల మండల పరిషత్ నిధులతో మంజూరైన సీసీ రోడ్లకు యాదగిరిగుట్ట ఎంపీపీ గడ్డమీది స్వప్న, జెడ్పీటీసీ కర్రె కమలమ్మ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి గ్రామంలోని ప్రతీ వీధిలో సీసీ మెటల్ రోడ్లు వేయడానికి కృషి చేస్తానన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెలను అభివృద్ధి చేసేందుకు సీసీ రోడ్లు, మిషన్ భగీరథ వంటి పనులు చేపడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ బోగ భాగ్యలక్ష్మీ, ఎంపీటీసీ బరిగే అరుణబాలయ్య, ఉపసర్పంచ్ బైర శ్రీరాములు, వార్డు సభ్యులు అయిలయ్య, సత్యం, శ్రీను, కవిత, రజిత తదితరులున్నారు.