అప్పం కిషన్
భూపాలపల్లి అర్బన్ : వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా భూపాలపల్లికి చెందిన అప్పం కిషన్‌ను పార్టీ జాతీయ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నియమించినట్లు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. కిషన్ విద్యార్థి దశ నుంచి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి అభిమాని కాగా, 2003 సంవత్సరంలో వైఎస్ చేపట్టిన పాదయాత్రతో కాంగ్రెస్‌పార్టీలో చేరి ఎన్‌ఎస్‌యూఐలో కీలకంగా పనిచేశారు.
2010లో జగన్ యువసేన వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. 2011లో వైఎస్సార్ సీపీలో చేరి పార్టీ బలోపేతానికి కృషిచేస్తున్నారు. 2012లో పార్టీ వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. జిల్లాల విభజన తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడిగా సింగరేణి ఎన్నికల్లో మహాకూటమి గెలుపొందేందుకు కృషిచేశారు. తన సేవలను గుర్తించి రాష్ట్రస్థాయి పదవి ఇచ్చిన పార్టీ జాతీయ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి, షర్మిల, వరంగల్ రూరల్ జిల్లా క్రాంతికుమార్, రాష్ట్ర నాయకులందరికీ అప్పం కిషన్ కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment