Appam Kishan
-
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా అప్పం కిషన్
భూపాలపల్లి అర్బన్ : వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా భూపాలపల్లికి చెందిన అప్పం కిషన్‌ను పార్టీ జాతీయ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నియమించినట్లు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. కిషన్ విద్యార్థి దశ నుంచి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి అభిమాని కాగా, 2003 సంవత్సరంలో వైఎస్ చేపట్టిన పాదయాత్రతో కాంగ్రెస్‌పార్టీలో చేరి ఎన్ఎస్యూఐలో కీలకంగా పనిచేశారు. 2010లో జగన్ యువసేన వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. 2011లో వైఎస్సార్ సీపీలో చేరి పార్టీ బలోపేతానికి కృషిచేస్తున్నారు. 2012లో పార్టీ వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. జిల్లాల విభజన తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడిగా సింగరేణి ఎన్నికల్లో మహాకూటమి గెలుపొందేందుకు కృషిచేశారు. తన సేవలను గుర్తించి రాష్ట్రస్థాయి పదవి ఇచ్చిన పార్టీ జాతీయ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, షర్మిల, వరంగల్ రూరల్ జిల్లా క్రాంతికుమార్, రాష్ట్ర నాయకులందరికీ అప్పం కిషన్ కృతజ్ఞతలు తెలిపారు. -
జగన్ సీఎం అయితే మేడారం తీసుకొస్తా..
భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్ ఎస్ఎస్ తాడ్వాయి: వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఏపీ సీఎం అయితే తొలిదర్శనం కోసం మేడారం సమ్మక్కృసారలమ్మ సన్నిధికి తీసు కొస్తామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు అప్పం కిషన్ చెప్పారు. పార్టీ నేతలతో కలసి ఆయన ఆదివారం మేడారంలో వన దేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కిషన్ మాట్లాడుతూ జగన్‌కు వనదేవతల ఆశీస్సులు ఉండాలని, వచ్చే ఎన్నికల్లో ఏపీ సీఎం కావాలని పూజలు నిర్వహించినట్లు తెలిపారు. మేడారంలో ఫిబ్రవరి 8 నుంచి 11 వరకు జరిగే మినీజాతరలో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. -
త్వరలో వైఎస్సార్సీపీ యూత్ కమిటీలు
కాజీపేట : వైఎస్సార్ సీపీ యువజన విభాగం కమిటీలను త్వ రలో నియమించనున్నట్లు యూత్ జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్ తెలి పారు. హన్మకొండలోని పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతి కుమార్ ఆధ్వర్యంలో మండల, గ్రామ, గ్రేటర్ యూత్ కమిటీలను వేయనున్నట్లు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందని, అలాంటి వారికి పార్టీ న్యాయం చేస్తుందని అన్నారు. దివంగత మహా నేత వైఎస్.రాజశేఖర రెడ్డి పేదలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆదుకున్నారని అన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా కోశాధికారి మంచె అశోక్, నాయకులు చంద హరికృష్ణ, చరణ్‌రెడ్డి, మైలగాని కళ్యాణ్, సుమిత్, రాజేష్‌రెడ్డి, మోర్ సింగ్ పాల్గొన్నారు.