కాజీపేట : వైఎస్సార్ సీపీ యువజన విభాగం కమిటీలను త్వ రలో నియమించనున్నట్లు యూత్ జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్ తెలి పారు. హన్మకొండలోని పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతి కుమార్ ఆధ్వర్యంలో మండల, గ్రామ, గ్రేటర్ యూత్ కమిటీలను వేయనున్నట్లు తెలిపారు.
పార్టీ బలోపేతానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందని, అలాంటి వారికి పార్టీ న్యాయం చేస్తుందని అన్నారు. దివంగత మహా నేత వైఎస్.రాజశేఖర రెడ్డి పేదలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆదుకున్నారని అన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా కోశాధికారి మంచె అశోక్, నాయకులు చంద హరికృష్ణ, చరణ్‌రెడ్డి, మైలగాని కళ్యాణ్, సుమిత్, రాజేష్‌రెడ్డి, మోర్ సింగ్ పాల్గొన్నారు.