వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ సీఎం అయితే తొలిదర్శనం కోసం మేడారం సమ్మక్కృసారలమ్మ
భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్
ఎస్‌ఎస్ తాడ్వాయి: వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ సీఎం అయితే తొలిదర్శనం కోసం మేడారం సమ్మక్కృసారలమ్మ సన్నిధికి తీసు కొస్తామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు అప్పం కిషన్ చెప్పారు. పార్టీ నేతలతో కలసి ఆయన ఆదివారం మేడారంలో వన దేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కిషన్ మాట్లాడుతూ జగన్‌కు వనదేవతల ఆశీస్సులు ఉండాలని, వచ్చే ఎన్నికల్లో ఏపీ సీఎం కావాలని పూజలు నిర్వహించినట్లు తెలిపారు. మేడారంలో ఫిబ్రవరి 8 నుంచి 11 వరకు జరిగే మినీజాతరలో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.