టీజీ కాదు.. టీఎస్ తోనే వాహనాల రిజిస్టేషన్లు!
టీజీ కాదు.. టీఎస్ తోనే వాహనాల రిజిస్టేషన్లు!
Published Wed, Jun 11 2014 7:00 PM | Last Updated on Sat, Sep 2 2017 8:38 AM
హైదరాబాద్: తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్లు ఇకపై తెలంగాణ స్టేట్ (TS) పేరుపై జరుగుతాయని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. టీజీ పేరుతో కాకుండా టీఎస్ పేరుతో రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని మహేందర్ రెడ్డి అన్నారు.
ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిందని, తెలంగాణలో ఏపీ పేరుపై ఉన్న పాత వాహనాల నంబర్‌ప్లేట్ మార్చడానికి 4 నెలల గడువు ఇస్తున్నట్టు మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. మార్పు సమయంలో ప్రజలపై భారం పడకుండా చూస్తామని, తెలంగాణలో 70 లక్షలకు పైగా వాహనాలున్నాయని ఓ ప్రశ్నకు మహేందర్ రెడ్డి సమాధానమిచ్చారు.
Advertisement