ఇక టీఎస్ పేరుతో వాహనాల రిజిస్ట్రేషన్ | telangana vehicles registration started with ts series | Sakshi
Sakshi News home page

ఇక టీఎస్ పేరుతో వాహనాల రిజిస్ట్రేషన్

Published Tue, Jun 17 2014 9:53 PM | Last Updated on Sat, Sep 2 2017 8:57 AM

telangana vehicles registration started with ts series

హైదరాబాద్: తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్లు ఇకపై తెలంగాణ స్టేట్ (TS) పేరుతో ఆరంభమైనట్లు రవాణాశాఖ వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం వాహనాల రిజిస్ట్రేషన్ల అంశానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత టీజీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలని భావించిన ప్రభుత్వం.. తర్వాత టీఎస్ పేరుతో రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది.

 
తాజాగా ప్రభుత్వం టీఎస్ పేరుతో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆరంభమైంది. అంతకుముందు ఏపీ పేరుపై ఉన్న పాత వాహనాల నంబర్‌ప్లేట్ మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం 4 నెలల గడువును ఇచ్చిన సంగతి తెలిసిందే.
 
తెలంగాణలోని వివిధ జిల్లాలకు వాహనాల రిజిస్ట్రేషన్ల కోడ్‌ల వివరాలు..

ఆదిలాబాద్ TS - 01, కరీంనగర్ - 02
వరంగల్‌  - 03, ఖమ్మం - 04, నల్లగొండ - 05
మహబూబ్‌నగర్‌ - 06, రంగారెడ్డి - 07, 08
హైదరాబాద్  - 09, 10, 11, 12, 13, 14
మెదక్ - 15, నిజామాబాద్ -16

ఆర్టీసీ వెహికల్స్‌కు TS Z, పోలీసు వాహనాలకు TS P 09

రవాణా వాహనాలకు...
T,U,VW,X,Y సిరీస్‌లు వాడుతూ రిజిస్ట్రేషన్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement