ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో వాహనాల రిజిస్ట్రేషన్ సిరీస్ విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. తెలంగాణ స్టేట్(టీఎస్) జారీ చేస్తూ కేంద్రం నుంచి బుధవారం గెజిట్ నోటిఫికేషన్ వెలువడడంతో అటు రవాణా శాఖ ఇటు వాహనదారుల్లో అయోమయం తొలగిపోయింది. జిల్లాల వారీగా కోడ్‌ను ఒకట్రెండు రోజుల్లో కేటాయిస్తామని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కనడంతో ఉత్కంఠ నెలకొంది. అల్ఫాబెటికల్ ప్రకారం ఆదిలాబాద్ జిల్లాకు ఏ అక్షరం మొదట ఉండడంతో ఇంతకుముందున్న 01 కోడ్ కొనసాగే అవకాశాలే అధికంగా ఉన్నాయని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
టీఎస్‌పైనే రిజిస్ట్రేషన్లు
కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ఇక నుంచి టీఎస్‌పైనే జరగనుంది. కోడ్‌పై సందిగ్ధత నెలకొంది. రిజిస్ట్రేషన్లు చేస్తున్నా నంబరు కేటాయించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఆదిలాబాద్‌కు అక్షర క్రమంలో ఏపీ 01 సిరీస్ ఉన్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో 24 జిల్లా ఏర్పాటు చేస్తామని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో కోడ్ నంబరు కేటాయింపులో తేడాలు ఉంటాయా అనేది స్పష్టత రావాల్సి ఉంది. మంచిర్యాల జిల్లాను దృష్టిలో ఉంచుకుని ఆ ప్రాంతంలో మరో కోడ్ కేటాయిస్తారా లేని పక్షంలో జిల్లా ఏర్పడిన అనంతరం మార్పులు చేస్తారా అనేది వేచి చూడాల్సిందే. ఇదివరకు ఏపీ 01పై ఆదిలాబాద్, ఏపీ 01ఏ పై మంచిర్యాల, ఏపీ 01బీ పై నిర్మల్ వాహనాలకు రిజిస్ట్రేషన్ చేసేవారు.
పాత వాహనాలు 1.30 లక్షలకుపైనే..
జిల్లాలో అన్ని రకాల పాత వాహనాలు కలిపి లక్షా 30 వే ల 016 ఉన్నాయి. వీటిలో ద్విచక్ర వాహనాలు 95,437, ఆటోరిక్షాలు 7,780, గూడ్స్ క్యారేజ్‌లు 5,203, కార్లు 4,864, మోపెడ్లు 3,714, ట్రాక్టర్లు(ప్రైవేట్) 2,554, ట్రా క్టర్లు కమర్షియల్ 2,134, జీపులు 575, మోటర్ క్యాబ్‌లు 1189 ఉన్నాయి. వీటి రిజిస్ట్రేషన్లు ప్రస్తుతం ఏపీ 01 సీరి స్ కోడ్‌పై కొనసాగుతుండగా, నాలుగు నెలల్లోగా టీఎస్ గా మార్చుకోవాలని రవాణా శాఖ సూచిస్తోంది. వాహనాల నంబరు కూడా మారుతుందనే ప్రచారం జరగడం తో వాహనదారుల్లో ఆందోళన వ్యక్తమైంది. ప్రధానంగా ఫ్యాన్సీ నంబర్లు తీసుకున్న వారు ఆందోళనకు గురయ్యారు.
నంబర్లు మారవని ఏపీ స్థానంలో టీఎస్‌గా, కే టాయించిన కోడ్‌ను మాత్రమే మార్చుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం రవాణా శాఖ అధికారుల స మావేశంలో స్పష్టం చేస్తూ గందరగోళానికి తెరదించారు. ఇతర జిల్లాలకు కోడ్ మారే అవకాశాలు ఉండగా, ఆది లాబాద్ జిల్లాకు మాత్రం 01 ఉండే అవకాశాలు అధికం గా ఉన్నాయి. దీంతో కేవలం ఏపీ స్థానంలో టీఎస్‌గా మార్చుకుంటే సరిపోతుంది. కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా త్వరలో ప్రకటిస్తామని రవాణా శా ఖ పేర్కొన్న నేపథ్యంలో భారం ఎలా ఉంటుందోనని అందరిలో ఆందోళన కనిపిస్తోంది. జిల్లాలో ప్రతినెల రిజి స్ట్రేషన్లతో రూ.20లక్షలు ఆదాయం సమకూరుతోంది.
జిల్లాల వారీగా కోడ్ నంబర్లు ఇలా ఉండే అవకాశముంది
ఆదిలాబాద్ 1
కరీంనగర్ 2
వరంగల్ 3
ఖమ్మం 4
నల్గొండ 5
మహబూబ్‌నగర్ 6
రంగారెడ్డి 7 - 8
హైదరాబాద్ 9 - 14
మెదక్ 15
నిజామాబాద్ 16
ఇక టీఎస్ 01
Published Fri, Jun 13 2014 3:57 AM | Last Updated on Sat, Sep 2 2017 8:42 AM
Advertisement
Advertisement