No Headline
ప్రస్తుతం సాగు వివరాలు
పంటల ఎకరాలు
వరి 1,63,341
పత్తి 94,269
మొక్కజొన్న 21,024
కంది 4,163
ఇతర 23,113
సాధారణంగా వరి నాట్లు ఆగస్టు మొదటి వారం వరకు పూర్తి అవుతాయి. ఈ సారి వర్షాలు ఎక్కువగా కురవకపోవడంతో నారు పోసినా నాట్లు వేయలేని పరిస్థితి నెలకొంది. పలు చోట్ల నారు ముదిరిపోయింది. గతేడాది వానకాలంలో 5,20,690 ఎకరాలు సాగైతే ఇప్పటి వరకు 3,05,910 ఎకరాలు మాత్రమే సాగు అవుతోంది. గతేదాడి వరి 3,79,108 ఎకరాలు సాగు అయితే ఇప్పటి వరకు 1,63,341 ఎకరాలే సాగు అయినట్లు సమాచారం. గతంతో పోలిస్తే సుమారు 2లక్షల ఎకరాల మేర తక్కువగా సాగవుతుంది. ఇంకా వర్షాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.
పలు మండలాల్లో లోటు వర్షపాతం
జిల్లాలో ఇప్పటి వరకు సగటు వర్షపాతం కంటే ఎక్కువగానే వర్షం కురిసింది. పలు మండలాల్లో లోటు, సాధారణ, అధిక వర్షపాతం నమోదైంది. లోటు వర్షపాతం వర్గల్, ములుగు, మర్కూక్, జగదేవ్‌పూర్, కొమురవెల్లిలలో నమోదు కాగా, సాధారణ వర్షపాతం హుస్నాబాద్, దుబ్బాక, సిద్దిపేట అర్బన్, దౌల్తాబాద్, రాయపోలు, గజ్వేల్, కొండపాక, చేర్యాలలో నమోదైంది. అలాగే అధిక వర్షపాతం సిద్దిపేట రూరల్, చిన్నకోడూరు, బెజ్జంకి, కోహెడ, అక్కన్నపేట, నంగనూరు, తొగుట, మిరుదొడ్డి, మద్దూరు, దూల్మిట్ట, నారాయణరావుపేట, అక్బర్‌పేట భూంపల్లి, కుకునూరుపల్లిలలో నమోదైనట్లు అధికారులు తెలిపారు. గోదావరి జలాలతో చెరువులను నింపే అవకాశం ఉండటంతో మరో 15 రోజుల్లో సాగు పెరిగే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment