సాక్షి, సిద్దిపేట: తెలం గాణ ఏర్పాటు తర్వాత బ్రాహ్మణ సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసి నిధులు కేటాయించిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేటలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రమణాచారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. బ్రాహ్మణుల కష్టాలు నేరుగా చూసిన సీఎం కేసీఆర్ వారి సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పా టు చేశారని చెప్పారు. బ్రాహ్మణుల అభివృద్ధికోసం ప్రత్యేక కమిటీని వేసి దీర్ఘకాలిక ప్రయోజనాలకోసం పథకాలు ప్రవేశపెడుతున్నామని వివరించారు. ప్రభుత్వ సలహాదారు రమణా చారి మాట్లాడుతూ.. నిరుపేద బ్రాహ్మణ యువ త, మహిళలకోసం కుటీర పరిశ్రమల ఏర్పాటు కు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment