‘‘ఏఆర్‌ఎమ్’ సినిమా మొదలుపెట్టినప్పుడు నటుడిగా ఇది నా 50వ చిత్రం అవుతుందనుకోలేదు. ఎగ్జయిటింగ్ స్క్రిప్ట్ ఇది. ఈ చిత్రంలో మూడు వైవిధ్యమైన పాత్రలు చేయడం పెద్ద సవాల్‌గా అనిపించింది. అయితే ఈ మూడు పాత్రలు దేనికవే ప్రత్యేకంగా ఉంటాయి’’ అని హీరో టోవినో థామస్ అన్నారు. జితిన్ లాల్ దర్శకత్వంలో టోవినో థామస్ హీరోగా కృతీ శెట్టి, ఐశ్వర్యా రాజేష్, సురభి లక్ష్మి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఏఆర్‌ఎమ్’. డా. జకారియా థామస్‌తో కలిసి లిస్టిన్ స్టీఫెన్ నిర్మించిన ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతోంది.
తెలుగులో ఈ నెల 12న మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా టోవినో థామస్ మాట్లాడుతూ– ‘‘చిన్న నటుడిగా నా కెరీర్ ఆరంభించాను. సపోర్టింగ్, కామెడీ, విలన్ రోల్స్ చేశాను. 2016 నుంచి లీడ్ రోల్స్ చేస్తున్నా. నటుడు కావాలనేది నా కల... ఇప్పుడు ఆ కలలో జీవిస్తున్నాను. ‘అజాయంతే రందం మోషణం’ (ఏఆర్ ఎమ్) అంటే అజయన్ రెండో దొంగతనం అని అర్థం. మిగతా భాషల వారికి ఈ పేరు పలకడం ఇబ్బందిగా ఉంటుందని ‘ఏఆర్‌ఎమ్’గా పిలుస్తున్నాం. యూనివర్సల్‌గా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. మైత్రీ లాంటి టాప్ డిస్ట్రిబ్యూటర్స్ మా సినిమాని తెలుగులో రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment