హీరోతో వివాదం.. ఊహించని షాకిచ్చిన డైరెక్టర్‌! | Director Sasidharan Releases Tovino Thomas Starrer Vazhakku Online Amid Controversy, Deets Inside | Sakshi
Sakshi News home page

Tovino Thomas: హీరోతో వివాదం.. సినిమా నేరుగా రిలీజ్!

Published Tue, May 14 2024 9:56 PM | Last Updated on Wed, May 15 2024 12:57 PM

Director Sasidharan releases Tovino Thomas starrer Vazhakku online

మలయాళ యంగ్ హీరో టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం వజక్కు. 2021లోనే ఈ చిత్రం పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు థియేటర్లలో రిలీజ్ కాలేదు. దీనికి కారణం దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్, హీరో టొవినో థామస్ మధ్య వివాదమే. అయితే మూడేళ్ల పాటు ఓపికగా ఉన్న డైరెక్టర్‌  సడన్‍గా షాకిచ్చాడు.  ఈ సినిమాను ఓ వీడియో ప్లాట్‍ఫామ్‍లో అప్‍లోడ్ చేశాడు.

తాజాగా వజక్కు చిత్రాన్ని వీమియో అనే ప్లాట్‍ఫామ్‍లో డైరెక్టర్ సనల్ కుమార్ శశిధరన్ అప్‍లోడ్ చేశారు. ఈ ప్లాట్‍ఫామ్ కూడా దాదాపు యూట్యూబ్ లాగే ఉంటుంది. వీమియోలో ఈ చిత్రాన్ని యూజర్లు ఉచితంగా చూసేలా అందుబాటులోకి తెచ్చారు. అయితే మొదట వజక్కు చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేసేందుకు హీరో టొవినో థామస్ అంగీకరించలేదని శశిధరన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన కెరీర్‌పై ప్రభావం చూపుతుందనే కారణంతో థియేటర్లలోనూ.. ఓటీటీలోనూ ఈ మూవీని రిలీజ్ చేయకుండా థామస్ అడ్డుపడుతున్నారని ఆయన ఆరోపించారు

స్పందించిన టొవినో థామస్

సనల్ శశిధరన్ చేసిన ఆరోపణలకు హీరో టొవినో థామస్ స్పందించారు. ఈ సినిమా నిర్మాణం కోసం తాను రూ.27లక్షలను ఖర్చు చేశానని.. తనకు ఎలాంటి లాభం రాలేదని అన్నారు. ఈ సినిమా విడుదల కాకపోవడానికి డైరెక్టరే కారణమని చెప్పారు. ముంబై ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించేందుకు కూడా ఆయన అంగీకరించలేదని టొవినో చెప్పారు. కాగా.. ఈ చిత్రంలో కునీ కుశృతి, సుదేవ్ నాయర్, అజీస్ నెడుమంగద్, బైజూ నీటో కీలకపాత్రలు పోషించారు. పారట్ మౌంట్ పిక్చర్స్, టొవినో థామస్ ప్రొడక్షన్స్ బ్యానర్లు నిర్మించిన ఈ మూవీకి పృథ్వి చంద్రశేఖర్ సంగీతం అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement