
రిలయన్స్ జియో మూడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రకటించింది. ఈ కొత్త ప్లాన్‌లు ఒక సంవత్సరం వ్యాలిడిటీతో వస్తాయి. అపరిమిత కాలింగ్, డేటా అలాగే సోనీ లివ్ (SonyLiv), జీ5 (Zee5) కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తాయి.
రూ. 3662 ప్లాన్:
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అపరిమిత కాలింగ్, రోజుకు 2.5 GB డేటా, అపరిమిత 5G డేటా, రోజుకు 100 SMSలతో వస్తుంది. ఈ ప్లాన్‌లో జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్‌తో పాటు సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్‌లు ఉచితంగా వస్తాయి. 365 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది.
రూ. 3226 ప్లాన్:
ఈ ప్లాన్‌లో అపరిమిత కాలింగ్, 5G డేటాతో పాటు 2GB రోజువారీ 4G డేటా, రోజుకు 100 SMSలు ఉంటాయి. జియోటీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్‌తో పాటు సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్‌లు జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్‌తో పాటు సోనీలివ్ సబ్‌స్క్రిప్షన్‌లు ఇతర ప్రయోజనాలు.
రూ. 3225 ప్లాన్:
ఇందులో అన్‌లిమిటెడ్ కాలింగ్, 5G డేటాతో పాటు 2GB రోజువారీ 4G డేటా కోటా, రోజుకు 100 SMS వంటి ప్రయోజనాలు ఉంటాయి. జియోటీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్‌తో పాటు ఈ ప్లాన్‌లో జీ5 సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.
ఇక ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లు వద్దనుకున్నవారికి తక్కువ ధరకు మరో వార్షిక ప్లాన్ అందుబాటులో ఉంది. అదే రూ. 1,999 ప్లాన్. ఇది అపరిమిత 5G డేటా, కాలింగ్‌తో వస్తుంది. వీటితో పాటు 2.5GB రోజువారీ 4G డేటా, రోజుకు 100 SMS కూడా అందిస్తుంది. ఈ ప్లాన్‌లో థర్డ్-పార్టీ ఓటీటీ ప్రయోజనాలేవీ లేవు కానీ ఇందులో జియో యాప్‌లు, సేవలకు యాక్సెస్ ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment