మీకు తెలిసిందనుకున్నదంతా అబద్ధమేనని మీరు భావిస్తే? జోజు జార్జ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం పానీ. ఒకే ఒక సంఘటన సాధారణ జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసి, దాచిన రహస్యాలను బహిర్గతం చేసే, విధేయతలను పరీక్షించే భయంకరమైన భయాలను ఎదుర్కొనేలా చేసే ప్రపంచంలోకి తీసుకెళుతుంది. నీడల నుంచి నిజం బయటపడుతుందా? లేదా దానిని బహిర్గతం చేసే ప్రయత్నంలో ప్రేమించే ప్రతిదాన్ని నాశనం చేస్తుందా? థియేట్రికల్ రన్ తర్వాత పానీ ఇప్పుడు జనవరి 16 నుంచి సోనీ లివ్‌లో అందుబాటులోకి వస్తోంది.
ఈ సందర్భంగా జోజు జార్జ్ మాట్లాడుతూ, ‘‘దాగి ఉన్న నిజాలను వెలికి తీయడానికి మించినది పానీ. ఇది వాటిని బహిర్గతం చేయడానికి అయ్యే వ్యయ ప్రయాసలను వెల్లడిస్తుంది. ఇది కుటుంబం, విధేయత, న్యాయం, ప్రతీకారానికి సంబంధించినది, ఇక్కడ ప్రతి నిర్ణయం భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ మాత్రమే కాదు, మానవ మనస్తత్వాన్ని లోతుగా ప్రతిబింబిస్తుంది. థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన తర్వాత, పానీ ఇప్పుడు సోనీ లివ్‌లో మరింత మంది ప్రేక్షకులను చేరుకుంటోంది. ఇదో భావోద్వేగ ప్రయాణం’’ అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
దర్శకత్వం, రచనతో పాటు నటుడిగానూ జోజు జార్జ్ కనిపించే ఈ చిత్రంలో సాగర్ సూర్య, జునైజ్ వి.పి, బాబీ కురియన్, అభినయ, అభయ హిరణ్మయి, సీమ, చాందిని శ్రీధరన్, ప్రశాంత్ అలెగ్జాండర్, సుజిత్ శంకర్, రినోష్ జార్జ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రియాజ్ ఆడమ్ నిర్మాతలు ఎడి స్టూడియోస్ పతాకంపై సిజో వడక్కన్ నిర్మిస్తుండగా... సినిమాటోగ్రఫీని వేణు, జింటో జార్జ్ అందిస్తున్నారు.
చదవండి: డబ్బు కోసం నన్నే చంపాలనుకుంది.. నా కూతురికి తండ్రి ఇంకెవరో..?: దేవిక మాజీ భర్త
Comments
Please login to add a commentAdd a comment