విక్టిమ్ వెబ్ సిరీస్ శుక్రవారం నుంచి సోనీ లైవ్ ఓటీటీ ప్లాట్‌ఫాంలో స్ట్రీమింగ్ అవుతూ ఆదరణ పొందుతోంది. ఒకే కాన్సెప్టును నలుగురు డైరెక్టర్లు వివిధ కోణాల్లో సిరీస్‌ను తెరకెక్కించారు. పా.రంజిత్ దమ్మమ్ అనే కథను, వెంకట్ ప్రభు కన్ఫెషన్స్ అనే కథను, ఎం.రాజేష్ విలేజ్ మిర్రర్ కథను, శింబుదేవన్ కోట్టై పాక్కు వత్తలుమ్ మొట్టైమాడి సిత్తరుమ్ అనే కథను రూపొందించారు. ఈ నాలుగు కథలు కాన్సెప్ట్ ఒకటే. భావోద్రేకాలతో కూడిన వినోదాన్ని జోడించిన క్రైమ్ థ్రిల్లర్ కథలతో తెరకెక్కించారు. అయితే నలుగురు దర్శకులు వారి వారి శైలిలో రూపొందించిన వెబ్ సిరీస్ ఇది.
కరోనా కాలంలో ఇంటిలోనే ఉండిపోయిన ఒక సహాయ కథా రచయితకు పని పోయే పరిస్థితి. దీంతో అతనికి ఒక సిద్ధ వైద్యుడి గురించి తెలియడంతో ఆయన్ని తన ఇంటికి ఆహ్వానిస్తాడు. ఆ తరువాత ఏం జరిగిందన్న అంశాలను వినోదభరితంగా రూపొందించిన కథ కోట్టై పాక్కు వత్తలుమ్ మొట్టైమాడి సిత్తరుమ్. ఇందులో సహాయ రచయితగా తంబి రామయ్య, సిద్ధ వైద్యుడిగా నాజర్ నటించారు.
అదే విధంగా నటుడు నటరాజన్ ఇంటిలో అద్దెకు నివసిస్తున్న నటి ప్రియా భవాని శంకర్ జీవితంలో జరిగే సంఘటనలతో రూపొందిన కథ విలేజ్ మిర్రర్. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన కన్ఫెషన్స్ కథలో నటి అమలాపాల్ ప్రధాన భూమిక పోషించారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆమె చక్కగా నటించారు. మరో ముఖ్య పాత్రలో ప్రసన్న నటించారు. ఇక పా.రంజిత్ తెరకెక్కించిన దమ్మమ్ కథ తండ్రీ కూతురు, సమాజం నేపథ్యంలో సాగుతుంది. ఇందులో నటుడు గురు సోమసుందరమ్ ప్రధాన పాత్రలో నటించారు.
చదవండి: నాకున్న ప్రేమను ఇలా తెలియజేశాను: రకుల్ ప్రీత్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment