
'మేడమ్ మేడమ్..' అంటూ హీరోయిన్ వెంటపడుతూ గీతా గోవిందంలో క్యూట్‌గా మాట్లాడినా, ఆ పిల్ల నాది అంటూ అర్జున్ రెడ్డిలో రౌడీయిజం చూపించినా అది విజయ్ దేవరకొండకే చెల్లుతుంది. మాస్ అయినా, క్లాస్ అయినా ఏదైనా సరే నటనతో రఫ్ఫాడిస్తాడు హీరో విజయ్. ప్రస్తుతం అతడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. నేడు (మే 9న) అతడి బర్త్‌డే.
ఈ సందర్భంగా లైగర్ యూనిట్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చింది. సోమవారం యూట్యూబ్‌లో లైగర్ హంట్ థీమ్‌ను రిలీజ్ చేసింది. బాక్సర్ అవడానికి విజయ్ ఎలా కష్టపడ్డాడన్నది ఇందులో సాంపుల్‌గా చూపించారు. ఈ హంట్ థీమ్ మాత్రం అదిరిపోయిందంటున్నారు ఫ్యాన్స్. కాగా లైగర్ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఆగస్టు 25న విడుదల కానుంది.
చదవండి: ఆసక్తిగా అక్షయ్ కుమార్ 'పృథ్వీరాజ్' ట్రైలర్..
బికినీలో కేక్ కట్ చేసిన ఆమిర్ ఖాన్ కూతురు, ఫొటోలు వైరల్
Comments
Please login to add a commentAdd a comment