Vijay Deverakonda Mass Speech At Liger Pre Release Event - Sakshi
Sakshi News home page

Vijay Deverakonda: ఆయన కొట్టిన దెబ్బకు రోజంతా బాధపడ్డా

Published Sun, Aug 14 2022 7:17 AM | Last Updated on Sun, Aug 14 2022 10:12 AM

Vijay Deverakonda Mass Speech at Liger Pre Release Event - Sakshi

నటుడు విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం లైగర్‌. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటించింది. బాక్సింగ్‌ దిగ్గజం మైక్‌టైసన్‌ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం ఈ నెల 25వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. కాగా చిత్రం తమిళనాడు విడుదల హక్కులను స్టూడియో–9 సంస్థ అధినేత, నటుడు, నిర్మాత ఆర్‌.కె.సురేష్‌ పొందారు.

ఈ సందర్భంగా శనివారం మధ్యాహ్నం చిత్ర యూనిట్‌ చెన్నైలోని ఓ హోటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. నటుడు విజయ్‌ దేవరకొండ, నటి అనన్య పాండే, ఆర్‌కే సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. ఆర్‌కే సురేష్‌ మాట్లాడుతూ.. అర్జున్‌రెడ్డి చిత్రం చూసిన తరువాత తాను విజయ్‌ దేవరకొండకు ఫ్యాన్‌ అయ్యానన్నారు. ఆయన అమేజింగ్‌ యాక్టర్‌ అని అన్నారు. అందుకే ఈ చిత్రాన్ని కొనుగోలు చేశానని తెలిపారు. ఇది మాస్‌ ఎంటర్‌టైనర్‌ అని, ప్రేమ సన్నివేశాలు ఉంటాయని నటి అనన్యపాండే పేర్కొంది. ఎంతో ప్రేమిస్తూ చిత్రం చేసినట్లు చెప్పారు.

చదవండి: ('ఆర్‌ఆర్‌ఆర్' అని గూగుల్‌లో సెర్చ్‌ చేశారా? మీకో సర్‌ప్రైజ్‌ !)

విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ.. లైగర్‌ చిత్రంలో తన పాత్రకు నత్తి ఉంటుందని తెలిపారు. అలా నటించడానికి చాలా కష్టపడ్డానని చెప్పారు. అయితే పాత్ర చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందన్నారు. చాలా ఇంట్రెస్టింగ్‌ కాన్సెప్ట్‌ అన్నారు. తమిళంలో నోటా చిత్రం చేశానని.. తమిళ ప్రేక్షకులు మంచి చిత్రాలను ఆదరిస్తారని తెలిపారు. తమిళంలో వరుసగా నటించాలన్న ఆశ ఉందన్నారు. దర్శకుడు లోకేష్‌ కనకరాజ్, వెట్రిమారన్, పా.రంజిత్‌ అంటే చాలా ఇష్టమని అన్నారు.

ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వారితో ఫోన్‌లో టచ్‌లో ఉన్నానని, త్వరలోనే లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా చిత్రంలో నటించే అవకాశం వస్తుందని ఎదురు చూస్తున్నానన్నారు. మైక్‌టైసన్‌తో నటించే ముందు కాస్త టెన్షన్‌ పడ్డానన్నారు. అయితే నటించడం గొప్ప అనుభూతి ఇచ్చిందని తెలిపారు. ఆయన గ్రేట్‌ పర్సన్‌ అన్నారు. షూటింగ్‌లో ఆయన చెంపపై కొట్టిన దెబ్బకు నొప్పితో ఆ రోజంతా బాధపడ్డానని చెప్పారు. నటి రమ్యకృష్ణ సూపర్బ్‌ యాక్టర్‌ అని కొనిడాడారు. చిత్రంలో స్ట్రాంగ్‌ మదర్‌గా నటించారని చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement