
విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన చిత్రం 'లైగర్'. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను పూరి కనెక్ట్స్ ,ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు. వరల్డ్ ఫేమస్ లవర్ తర్వాత దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత విజయ్ నటించిన సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో లైగర్‌పై ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో భారీ అంచనాల మధ్య నేడు(గురువారం)లైగర్ సినిమా విడుదలైంది.
ఈ నేపథ్యంలో ఆడియెన్స్ రెస్పాన్స్ చూసేందుకు విజయ్, అనన్య హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌కు వెళ్లారు. వీళ్లు ఎంట్రీ కాగానే ఆడియెన్స్ థియేటర్‌లో రచ్చరచ్చ చేశారు. విజిల్స్ వేస్తూ పేపర్లు చింపుతూ హంగామా సృష్టించారు. దీంతో విజయ్ క్రేజ్ చూసిన అనన్య పాండే కాస్త భయపడినట్లుంది. కాస్త కంగారుగానే థియేటర్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment