
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం లైగర్. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య ఆగస్టు 25న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆశించినంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో అటు పూరి జగన్నాథ్‌కు, ఇటు విజయ్‌కు కెరీర్‌లో బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా నిలిచింది.
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమా కథను పూరి ముందుగా కన్నడ స్టార్ హీరో యష్‌కు వినిపించాడట. అయితే ఆయన నో చెప్పడంతో ఈ ప్రాజెక్ట్ విజయ్ దగ్గరికి వెళ్లిందట. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ సినిమాను రిజెక్ట్ చేసి యశ్ మంచి పనే చేశాడంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment