
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ సినిమా పూరీ జగన్నాథ్‌కు, బయ్యర్లకు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. అయితే ఎంతో కొంత నష్టాన్ని పూడ్చేందుకు తాను ప్రయత్నిస్తానన్నాడు పూరీ. కానీ ఇంతవరకు ఆ డబ్బు అందకపోవడంతో బయ్యర్లు ధర్నాకు దిగుతామని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారట. ఈ విషయంపై పూరీ మాట్లాడిన ఆడియో కాల్ లీకైంది.
'ఏంటి, బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా? నేను ఎవరికీ తిరిగి డబ్బివ్వాల్సిన అవసరం లేదు. అయినా ఎందుకిస్తున్నాను? పాపం, వాళ్లు కూడా నష్టపోయారులే అని! ఇదివరకే బయ్యర్లతో మాట్లాడాను. ఒక అమౌంట్ ఇస్తానన్నాను, వాళ్లూ ఒప్పుకున్నారు. కాకపోతే ఒక నెల రోజులు గడువు అడిగాను. ఇస్తానని చెప్పాక కూడా ఇలా ఓవరాక్షన్ చేస్తే అసలివ్వబుద్ధి కాదు. పరువు కోసం డబ్బులిస్తున్నాం, నా పరువు తీయాలని చూస్తే ఒక్క రూపాయి కూడా ఇవ్వను. ఇక్కడ అందరం గ్యాంబ్లింగ్ చేస్తున్నాం. కొన్ని ఆడతాయి, కొన్ని పోతాయి. ఒకవేళ సినిమా హిట్ అయితే బయ్యర్స్ దగ్గర వసూలు చేయడానికి నానాపాట్లు పడాలి. పోకిరి దగ్గర నుంచి ఇస్మార్ట్ శంకర్ దాకా బయ్యర్స్ నుంచి నాకు రావాల్సిన డబ్బు ఎంతో ఉంది. బయ్యర్స్ అసోసియేషన్ అది నాకు వసూలు చేసి పెడుతుందా? లేదు కదా! ధర్నా చేస్తారా? చేయండి. ధర్నా చేసినవారికి తప్ప మిగతావాళ్లందరికీ డబ్బులిస్తాను' అని పూరీ కోపంతో శివాలెత్తిపోయాడు. ప్రస్తుతం ఈ ఆడియో లీక్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
చదవండి: హ్యాపీగా టాయ్‌లెట్స్ కడిగేవాడిని: నటుడు
నేనెలా ఉన్నా అందగత్తెనే
Comments
Please login to add a commentAdd a comment