
రౌడీ హీరో విజయ్ దేవరకొండకు బాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ షాక్‌కు గురి చేస్తోంది. ఆయన నటించిన చిత్రాలేవి అక్కడ విడుదల కాకున్నా... ముంబైలో ఏ ఈవెంట్ నిర్వహించినా అక్కడ జనం ప్రవాహంలా వస్తున్నారు. విజయ్ దేవరకొండ నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ముంబైలో ప్రచార కార్యక్రమాలు జరుపుతున్నారు.
(చదవండి: గాడ్ ఫాదర్‌ని కలిసిన లైగర్)
ఇటీవల లైగర్ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో మల్టీప్లెక్స్ మాల్ మొత్తం నిండిపోగా..తాజాగా నవీ ముంబైలో జరిగిన లైగర్ ఈవెంట్ జనసంద్రంగా మారిపోయింది. ఈ ఈవెంట్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ హీరోలకు మించిన క్రేజ్ విజయ్ దేవరకొండకు రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అభిమానులను కంట్రోల్ చేయడం కోసం విజయ్, అనన్య ఈవెంట్ మధ్యలోనే బయటకు వెళ్లాల్సి వచ్చింది. ఒక తెలుగు హీరోకు ముంబైలోని ఫాలోయింగ్ చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు.
లైగర్ ఇప్పటికే టీజర్, పోస్టర్లు , ఫస్ట్ సింగిల్‌తో భారీ బజ్ ని క్రియేట్ చేయగా, ట్రైలర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తున్న నటిస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో లెజెండ్ మైక్ టైసన్ ఇండియన్ స్క్రీన్‌పై అరంగేట్రం చేస్తున్నారు. పూరి కనెక్ట్స్ , బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
Team #Liger is overwhelmed with all the love that you showered on us today at our mall visit in Mumbai.
— Charmme Kaur (@Charmmeofficial) July 31, 2022
We would like to thank everybody who came to support us. Unfortunately, we had to leave midway for the safety of everyone! #WaatLagaDenge#LigerManiaBegins
(1/2) pic.twitter.com/8jJzip4GLQ
Comments
Please login to add a commentAdd a comment