
స్టార్ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ ముంబైని తాకింది. అక్కడ బాలీవుడ్ స్టార్స్ కు ఏమాత్రం తగ్గని ఫాలోయింగ్ రౌడీ స్టార్ కు కనిపిస్తోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘లైగర్’. ఈ చిత్ర ట్రైలర్‌ని ఇటీవల ముంబైలోని అంథేరీ సినీపోలీస్ లో విడుదల చేశారు. ఈ వేడుకలో లైగర్ టీమ్ మొత్తం పాల్గొంది. రౌడీ హీరో విజయ్‌ని చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.
(చదవండి: నెంబర్ వన్ స్థానం కోసం భారీ మొత్తంలో డబ్బులిచ్చా: సమంత)
ప్రొగ్రామ్ పూర్తయిన తర్వాత విజయ్ అక్కడి నుంచి బయలుదేరగా అభిమానులు చుట్టుముట్టారు. ‘రౌడీ రౌడీ’అంటూ నినాదాలు చేస్తూ ఫోటోలో దిగేందుకు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియోని చిత్ర యూనిట్ సంస్థ పూరీ కనెక్ట్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ముంబై సీనీ పోలీస్ మాస్ థియేటర్‌గా మారిన అనుభూతి కలిగింది క్యాప్షన్ ఇచ్చింది. దీనిపై విజయ్ స్పందిస్తూ.. ముంబై నా నివాసంగా ఫీలైన క్షణాలివే’అని రాసుకొచ్చాడు. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో విజయ్ సరసన అనన్య పాండే నటిస్తోంది. పూరి కనెక్ట్స్ , బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఆగస్ట్ 25న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
The moment when Mumbai starts to feel like home 😀❤️ https://t.co/mw7ePNaNZU
— Vijay Deverakonda (@TheDeverakonda) July 23, 2022
Comments
Please login to add a commentAdd a comment