
డాషింగ్ డైరెక్టర్ పూర్తి జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్‌తో తాజాగా తెరకెక్కిన చిత్రం లైగర్. పాన్ ఇండియా చిత్రంగా రూపొందిన లైగర్ ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండంలో మూవీ టీం ప్రమోషన్స జోరు పెంచేసింది. ఇందుకోసం లైగర్ టీం పట్నా(బిహార్)లో వాలిపోయింది. ఈ క్రమంలో అక్కడ రోడ్‌సైడ్‌లో ఉన్న ఫేమస్ టీ స్టాల్ విజయ్ సందడి చేశాడు. కొందరు యువతి యువకులు కలిసి‘గ్రాడ్యుమేట్ చాయ్ వాలి’ పేరుతో రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన ఈ టీ-స్టాల్‌కు మంచి డిమాండ్ ఉంది. ప్రమోషన్స్ నేపథ్యంలో పట్నా వెళ్లిన లైగర్ అక్కడ ఈ టీస్టాల్లో సందడి చేసింది.
ఈ సందర్భంగా సదరు టీ-స్టాల్ నిర్వహకులతో విజయ్ సెల్ఫీ తీసుకున్నాడు. అనంతరం టీ రుచి చూశాడు. పూరి కనెక్ట్స్ నిర్మాణ సంస్థ పేరుతో ఉన్న ట్విటర్ ఖాతాలో ఈ ఫొటోలు దర్శనమిచ్చాయి. దీంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్, పూరి కనెక్ట్స్‌లో చార్మి నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాక్సింగ్ చాంపియన్ మైక్ టైసన్ కీ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుండగా.. తెలుగు సీనియర్ నటి రమ్యకృష్ణ విజయ్‌కి తల్లిగా కనిపించనుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఆగస్ట్ 25న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
Chaiwala- #VijayDeverakonda visited the famous ‘Graduate Chaiwali’ in the lanes of Patna as a part of today’s #Liger city promotional tour 😀#LigerOnAug25th @TheDeverakonda @ananyapandayy @karanjohar #PuriJagannadh @Charmmeofficial @apoorvamehta18 @DharmaMovies pic.twitter.com/pTjgruiM20
— Puri Connects (@PuriConnects) August 6, 2022
చదవండి:
అప్పుడే ఓటీటీకి బింబిసార, స్ట్రీమింగ్ అక్కడేనా?
సమంతపై ఇప్పటికి గౌరవం ఉంది.. కానీ!: నాగ చైతన్య
Comments
Please login to add a commentAdd a comment