లైగర్ మూవీ ఫ్లాప్‌తో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చిక్కుల్లో పడ్డారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బక్సాఫీసు వద్ద ఘోర పరాజయం పొందింది. దీంతో ఈ మూవీ నిర్మాతల్లో ఒకరైన పూరీ ఆర్థికంగా భారీగా నష్టపోయారు. మరోవైపు లైగర్ వల్ల తాము ఆర్థికంగా నష్టపోయామని, పెట్టన డబ్బులో కోంతభాగం వెనక్కి ఇవ్వాలంటూ పలువురు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పూరీని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పూరీ సమయంలో కోరడంతో వారు బెదిరింపులకు పాల్పడుతున్నారు.
చదవండి: నిజమే పూరీ పెద్ద మోసగాడు.. పరువు తీసేద్దాం పదండి!: లేఖ వైరల్
దీంతో బుధవారం పూరీ పోలీసులను ఆశ్రయించారు. డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, ఫైనాన్సియర్ శోభన్‌ల ద్వారా తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆయన జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అంతేకాదు వారినుంచి తనకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. డిస్ట్రిబ్యూటర్లు తన ఇంటిపై దాడి చేసే అవకాశం ఉందని, ముందస్తు భద్రత కల్పించాలని ఆయన ఫిర్యాదు కోరారు. ఈ మేరకు పోలీసులు పూరీ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు. గురువారం ఆయన ఇంటి వద్ద కట్టుదిట్టమైన పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు.
చదవండి: పెద్దింటి కోడలు కాబోతున్న యంగ్ హీరోయిన్ వర్ష!
కాగా గత ఆగస్ట్ 25న భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన లైగర్ మూవీ ఘోర పరాజయం పొందింది. నైజాం డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్షియర్ వరంగల్ శీను, శోభన్ బాబులు నష్టపోయిన డబ్బులు తిరిగి చెల్లించాలని పూరీపై ఒత్తిడి పెంచారు. సుమారు రూ.8 కోట్ల మేర నష్టం వాటిల్లిందని, వాటిని తిరిగి ఇప్పించాలంటూ పూరీకి లేఖలు రాశారు. ఈ విషయమై పూరీ మాట్లాడిన ఓ ఆడియో ఫైల్ రెండు రోజుల క్రితం వైరల్ అయింది. ఈ నెల 27న వారంతా తన ఇంటి ముందు ధర్నా చేయబోతున్నారని, తన పరువు తీసేందుకు కుట్ర చేస్తున్నారంటూ పూరీ వాపోయారు. అయితే ఈ విషయమైన డిస్ట్రిబ్యూటర్లు కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment