
అయితే హామీ ఇచ్చి ఆరు నెలలు కావస్తున్నా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో మే 12న ఎగ్జిబిటర్లు ఫిలిం ఛాంబర్ ఎదుట నిరవధిక దీక్ష చేపట్టారు.
భారీ అంచనాల మధ్య విడుదలైన లైగర్ ఎంతటి పరాజయాన్ని మూటగట్టుకుందో తెలిసిందే! విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకనిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టడంలో దారుణంగా విఫలమైంది. దీంతో ఈ సినిమా వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తామని ఎగ్జిబిటర్లకు మాటిచ్చాడు పూరీ. అయితే హామీ ఇచ్చి ఆరు నెలలు కావస్తున్నా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో మే 12న ఎగ్జిబిటర్లు ఫిలిం ఛాంబర్ ఎదుట నిరవధిక దీక్ష చేపట్టారు.
నిర్మాతల మండలి సహా తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమస్య పరిష్కారం చేస్తామని మాటివ్వడంతో ఎగ్జిబిటర్లు గురువారం దీక్ష విరమించారు. పూరీ జగన్నాథ్, చార్మి త్వరలో అంతా సర్దుబాటు చేస్తామని చెప్పడం వల్లే దీక్ష విరమించామని పేర్కొన్నారు.