
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన ‘అక్డీ పక్డీ' సాంగ్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇందులో అనన్య పాండేతో కలిసి విజయ్ వేసిన స్టెప్పులకు సినీ ప్రియులను తెగ ఆకట్టుకుంటున్నాయి. విజయ్‌కి అంతగా డ్యాన్స్ రాదనే విషయం అందరికి తెలిసిందే. అందుకే విజయ్ సినిమాల్లో పెద్దగా మాస్ సాంగ్స్ ఉండవు.. ఉన్నా అంతగా స్టెప్పులేసిన దాఖలాలు లేవు. కానీ లైగర్ కోసం మాత్రం విజయ్ తెగ కష్టపడినట్లు తెలుస్తోంది.
(చదవండి: ఇంట్లో వాళ్లు కూడా అనుమానించారు.. అందుకే స్పందించా: రామ్)
‘అక్డీ పక్డీ’పాటలో విజయ్ అదిరిపోయే ఫాస్ట్ బీట్ స్టెప్పులతో రెచ్చిపోవడంతో ఆయన ఫ్యాన్స్ కూడా అవాక్కవుతున్నారు. రౌడీ హీరో ఈ రేంజ్‌లో డ్యాన్స్ చేస్తారని ఊహించలేదని కామెంట్స్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ పాట కొరియోగ్రఫీ, షూటింగ్ గురించి విజయ్ దేవరకొండ ఆసక్తికరమైన ట్విట్ చేశాడు.
ఈ పాట కొరియోగ్రఫీ చూసినప్పుడు తాను ఏడ్చేశానని.. కానీ షూటింగ్‌లో మాత్రం బ్లాస్ట్ చేసేశని చెప్పుకొచ్చాడు. మొత్తానికి తనలో కూడా మంచి డ్యాన్స్‌ర్ ఉన్నాడని విజయ్ నిరూపించుకున్నాడు.రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, మైక్ టైసన్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment