Vijay Devarakonda Full Busy With His Upcoming Movies 2022 - Sakshi
Sakshi News home page

Vijay Devarakonda: 'పుష్ప' మూడో భాగంలో హీరోగా విజయ్‌ దేవరకొండ !

Published Tue, Mar 15 2022 6:49 PM | Last Updated on Tue, Mar 15 2022 7:55 PM

Vijay Devarakonda Full Busy With His Upcoming Movies 2022 - Sakshi

అత్యంత కొద్ది సమయంలోనే మోస్ట్‌ పాపులారిటీ సంపాదించుకున్నాడు రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ. ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచి డిమాండ్‌ ఉన్న స్టార్లలో విజయ్‌ ఒకరని చెప్పడంలో సందేహం లేదు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం, డియర్ కామ్రెడ్‌ చిత్రాల భారీ విజయంతో విజయ్‌కు మంచి పేరు వచ్చింది. అయితే రెండేళ్లనుంచి ఈ రౌడీ హీరో సినిమా రాలేదు. అయితే తన ఫ్యాన్స్‌ను రెండేళ్లు వెయిట్‌ చేయించిన విజయ్‌ డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ డైరెక్షెన్‌లో తెరకెక్కుతున్న 'లైగర్‌' మూవీతో ఐఫీస్ట్‌ ఇవ్వనున్నాడు. ఇవే కాకుండా మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్‌తో విజయ్‌ తన అభిమానులను అలరించనున్నాడని టాక్‌ వినిపిస్తోంది. 

జనవరి ప్రారంభంలో క్రియేటివ్ డైరెక్టర్‌ పుట్టినరోజున విజయ్‌ చేసిన ట్వీట్‌ పలు ఆసక్తిర విషయాలకు హింట్‌ ఇస్తోందని తెలుస్తోంది. అల్లు అర్జున్‌తో 'పుష్ప: ది రైజ్‌' సినిమా రూపొందించి భారీ హిట్ కొట్టాడు సుకుమార్. త్వరలో ఈ సినిమా రెండో భాగం 'పుష్ప: ది రూల్‌' షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా తర్వాత 'పుష్ప: ది ర్యాంపేజ్‌' అనే టైటిల్‌తో సుకుమార్‌, విజయ్ దేవరకొండల చిత్రం రానుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ చర్చ సోషల్ మీడియాలో జోరుగానే సాగింది. సమంత, నాగ చైతన్యల సూపర్‌ హిట్ ఫిల్మ్‌ మజిలీ డైరెక్టర్‌ శివ నిర్వాణతో కూడా విజయ్‌ ఓ సినిమా తీయనున్నాడని సమాచారం. బిజీ షెడ్యూల్స్ వల్ల ఈ మూవీకి డేట్స్‌ కుదరట్లేదని తెలుస్తోంది. ఇందులో సమంతనే హీరోయిన్‌గా అనుకుంటున్నట్లు టాలీవుడ్ వర్గాల భోగట్టా. ఈ మూవీకి కోలీవుడ్ సెన్సేషన్‌ అనిరుధ్‌ సంగీతం అందించనున్నాడని టాక్‌. 
 


ఇవేకాకుండా మళ్లీ పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌లో విజయ్‌ దేవరకొండ 'జనగణమన' సినిమా చేయనున్నాడని సమాచారం. పూరీ జగన్నాథ్ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అయిన ఈ మూవీని మొదట మహేశ్ బాబుతో తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. తర్వాత ఏమైందో ఏమో కానీ ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఇప్పుడు ఈ చిత్రాన్ని విజయ్‌తో తీయనున్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు స్టార్‌ డైరెక్టర్‌లు అయిన త్రివిక్రమ్‌ శ్రీనివాస్, శివ కొరటాల దర్శకత్వంలోనూ ఈ రౌడీ హీరో సినిమా చేయనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరీ ఇవి ఎంతవరకూ నిజమో వేచి చూడాలి. 

చదవండి: విజయ్‌ దేవరకొండ త్రోబ్యాక్‌ వీడియో.. పూరీ జగన్నాథ్‌ షాక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement