విషు, ఛార్మీ, విజయ్ దేవరకొండ, అనన్య పాండే, పూరీ జగన్నాథ్
‘‘నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సినిమా ‘లైగర్’. గుంటూరులోనే కాదు.. ఇండియాలో ఎక్కడికి వెళ్లినా నాపై మీరు చూపిస్తున్న ప్రేమను మరచిపోలేను’’ అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్యా పాండే జంటగా నటించిన చిత్రం ‘లైగర్’. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మించిన ఈ మూవీ ఈ నెల 25న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా గుంటూరులో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘నాకు అరవై ఏళ్లు వచ్చి, సినిమాలు మానేసి ఇంట్లో కూర్చొని ఉన్నా కూడా ‘లైగర్’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న 20రోజులు, మీ (అభిమానులు) ప్రేమని మరచిపోలేను.. ఆలోచిస్తుంటాను. అంత స్ట్రాంగ్ మెమొరీ నాకు ఇచ్చారు. అంతే మెమొరీ మీకు తిరిగి ఇవ్వడం నా బాధ్యత. మీకు గుర్తుండిపోయే సినిమా ‘లైగర్’. ఈ సినిమాకి మూడేళ్లు పట్టింది. ఈ చిత్ర కుమ్మేస్తుంది. ఆగస్టు 25న గుంటూరుని మీరు (అభిమానులు) షేక్ చేయాలి’’ అన్నారు.
(చదవండి: ట్రెండింగ్‌లోకి ‘బాయ్‌కాట్ లైగర్’.. ‘రౌడీ’ ఫ్యాన్స్ గట్టి కౌంటర్)
పూరి జగన్నాథ్ మాట్లాడుతూ–‘‘మిమ్మల్ని చూస్తుంటే ‘లైగర్’ ప్రీ రిలీజ్‌కి వచ్చామా? సక్సెస్ మీట్‌కి వచ్చామా? అన్నది అర్థం కావడం లేదు. మీరందరూ ఒక్కొక్క టిక్కెట్ కొంటే చాలు మా సినిమా బ్లాక్‌బస్టర్. ఈ సినిమాలో విజయ్ ఇరగదీశాడు.. అనన్య చింపేసింది. రమ్యకృష్ణ ఉతికి ఆరేసింది. ఈ సినిమాలో హైలైట్ మైక్ టైసన్. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు.. ఎంత వసూలు చేస్తుందో తెలియదు. ఇవన్నీ పక్కనపెట్టి ఇంతకంటే డబుల్ బడ్జెట్‌తో విజయ్‌తో ‘జనగణమణ’ సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేశాం.. అది మా నమ్మకం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment